పల్లె పోరుపై ఉత్కంఠ..
ABN , Publish Date - Jun 07 , 2025 | 01:05 AM
స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొన్నది. ఏడాది కాలంగా ఇప్పుడు, అప్పుడు అని ఊరిస్తూ వస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తున్నది. ఈ ఎన్నికల్లో ముందు పంచా యతీ ఎన్నికలను నిర్వహిస్తారా, మండల, జిల్లా పరి షత్ ఎన్నికలను నిర్వహిస్తారా అనే విషయమై డైలామా నెలకొన్నది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుం టుందని అంతా వేచి చూశారు.
- ముందు పంచాయతీ ఎన్నికలా, పరిషత్ ఎన్నికలా?
- కేబినెట్ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోని ప్రభుత్వం
- 15న జరగనున్న కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొన్నది. ఏడాది కాలంగా ఇప్పుడు, అప్పుడు అని ఊరిస్తూ వస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తున్నది. ఈ ఎన్నికల్లో ముందు పంచా యతీ ఎన్నికలను నిర్వహిస్తారా, మండల, జిల్లా పరి షత్ ఎన్నికలను నిర్వహిస్తారా అనే విషయమై డైలామా నెలకొన్నది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుం టుందని అంతా వేచి చూశారు. కానీ ఆ సమావేశంలో దీని గురించి చర్చించ లేదని తెలుస్తున్నది. ఈ నెల 15న జరిగే ప్రత్యేక కేబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. బీసీ రిజర్వేషన్లపై ఎటూ నిర్ణయం తేలక పోవడంతో ఈ ఎన్నికలు జరగడం లేదు. దీంతో స్థానిక సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నప్పటికీ, అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. రావాల్సిన నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావడం లేదు.
ప్రత్యేక అధికారుల పాలనలోనే స్థానిక సంస్థలు..
గ్రామ పంచాయతీల పాలక వర్గాల పదవీ కాలం గత ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ముగిసింది. ఆ వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సిన ప్రభుత్వం నిర్వ హించకుండా ప్రత్యేక అధికారుల పాలన తీసుక వచ్చింది. ఏడాదిన్నర గడుస్తున్నా కూడా ఎన్నికలు నిర్వహించడం లేదు. జూన్, జులై మాసంలో మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాలు, ఈ ఏడాది జనవరి నెలాఖరుతో మున్పిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన తీసుకవచ్చారు. ప్రాథమిక సహకార సంఘాల పదవీ కాలం కూడా ముగియడంతో పాలక వర్గాల పదవీ కాలాన్ని ఆరు నెలలపాటు పొడిగించారు. స్థానిక సం స్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించక పోవడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రిజర్వేషన్ల వల్లనే ఆలస్యం..
ఏడాదిన్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన చేపడతా మని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్, నవంబర్‌లో కుల గణన చేపట్టింది. రాష్ట్రంలో అత్యధికంగా బీసీ కులాలకు చెందిన వాళ్లే ఉన్నారని తేలింది. ఈ కులగణన వల్ల ఎన్నికలు ఆలస్యం అయ్యాయి. అలాగే దీనిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టబద్ధత తీసుకవచ్చారు. రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయాల పరంగా స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. దానిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలపలేదు. జనాభా లెక్కలతో పాటు కుల గణన చేస్తామని ప్రకటించింది. చట్టపరంగా బీసీలకు ఇప్పట్లో 42 శాతం రిజర్వేషన్లు దక్కే అవకాశాలు న్నాయి. అప్పటి వరకు ఎన్నికల నిర్వహణ ఆపితే ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశా లున్నాయి, పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నది. ఈ నెల 15వ తేదీన జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మంత్రులు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందు పంచాయతీ ఎన్నికలా, మండల జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తారా అనే విషయమై వివిధ రాజకీయ పార్టీల నేతల్లో నెలకొన్న ఉత్కంఠ వీడేలా లేదు.