రిజర్వేషన్లపై ఉత్కంఠ
ABN , Publish Date - Jun 27 , 2025 | 01:12 AM
హైకోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తప్పని సరైంది.
జగిత్యాల, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తప్పని సరైంది. ప్రభుత్వం ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావించింది. కానీ పంచా యతీ ఎన్నికలు మూడు నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిం చాలని భావించింది. గ్రామ పంచాయతీ పాలక వర్గాలు పూర్తయి ఏడాదిన్నర అవుతుండగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తయి సంవత్సరం దాటింది. ఇప్పుడు ఈ రెండింటిలో ఏ ఎన్నికలు ముందు నిర్వహిస్తారనేది చర్చనీయంశంగా మారింది. మరో వైపు బీసీ రిజర్వేషన్ల అంశం కోర్టులోనే ఉంది. ప్రభు త్వం ఏ నిర్ణయం తీసుకున్నా అమలు చేసేలా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. దీనిపై రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
రిజర్వేషన్లపై ఆశలు
స్థానిక సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. జడ్పీటీసీ, ఎంపీటీసీలతో పాటు సర్పంచ్‌లుగా పోటీ చేయాలనుకునే ఆశావహులు తమ గ్రామ పంచా యతీ, తమ ప్రాదేశిక ప్రాతినిధ్య నియోజకవర్గం ఏ వర్గానికి రిజర్వు చేయబడుతుందననే అయోమ యంలో ఉన్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల రిజర్వేషన్లను నెల రోజుల్లో ఖరారు చేస్తామని ఇటీవల హైకోర్టుకు విన్నవించింది. ఈ నేపథ్యంలో ఆశావహుల్లో ఆశలు రేకెత్తినట్లయింది. రోటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఉండే అవకాశాలుండటంతో ఆయా పాత స్థానాలకు కొత్త రిజర్వేషన్లు రానున్నా యి. రిజర్వేషన్లు ఇంకా ఖరారు కాకపోవడంతో ఆయా గ్రామాల్లోని కీలక నాయకులు, మండలాల్లో పట్టున్న నేతలు తమ అనుచరులను కాపాడుకోవడం కష్టంగా మారింది. ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్ వస్తుందో ఇప్పుడే తెలియకపోవడంతో అన్ని సామాజిక వర్గాలకు చెందిన అనుచరులను తమ వెంట తిప్పుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.
కోర్టును ఆశ్రయించిన మాజీ సర్పంచ్‌లు
పంచాయతీల్లో పాలక వర్గాల గడువు పూర్తయి ఏడాదిన్నర కావస్తోంది. దీంతో పంచాయతీల నిర్వహ ణ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదని, ఎన్నికలు నిర్వహించే వరకు పాత సర్పంచ్‌లను కొనసాగించాలంటూ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి కొందరు మాజీ సర్పంచ్‌లు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై వాదనలు విన్న హైకోర్టు సెప్టెంబరు 30వ తేదీలోగా ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికలకు సిద్ధంగా యంత్రాంగం
గతంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పడంతో జిల్లా యంత్రాంగం గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసింది. దాంతో పాటు పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులు లేకుండా నిర్వహించనున్నారు. పోలింగ్ కోసం పలు ప్రాంతాల నుంచి తెప్పించిన బ్యాలెట్ బాక్సులకు మరమ్మతు చేయించి సిద్ధం చేసి పెట్టారు. ఎన్నికల షెడ్యూల్ జారీ అయిన వెంటనే సిబ్బందికి శిక్షణ ఇస్తే సరిపోనుంది.
అధికారుల ఎన్నికల నిర్వహణపై శిక్షణ
పార్లమెంట్ ఎన్నికల తరువాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారన్న సంకేతాలు రావడంతో జిల్లాలోని జడ్పీటీసీ, ఎంపీటీసీల వారీగా ఓటర్ల జాబి తాను సిద్ధం చేసిపెట్టారు. ఎన్నికలు పార్టీ గుర్తుల ఆధారంగా నిర్వహించనున్నందున బ్యాలెట్ పేపర్లు తెచ్చి ఇప్పటికే గోడౌన్లలో భద్రపరిచారు. పీఓ, ఏపీఓ లకు శిక్షణ ఇచ్చారు. షెడ్యూల్ వస్తే మాత్రం ఓపీ ఓలకు కూడా డివిజన్ల వారీగా శిక్షణ నివ్వడంతో పా టు నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత బ్యాలెట్ పేపర్లను ముద్రించనున్నారు.
కోర్టులోనే బీసీ రిజర్వేషన్ల అంశం
స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్‌ల 42 శాతం అమలు చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తు న్నాయి. కోర్టు పరిధిలో ఈ సమస్య ఉన్నందున అది తేలిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలనేది వారి వాదన. అయితే విషయం కోర్టులో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుని ఎన్నికలు పోతుందో అనేది వేచి చూడాల్సిందే. బీసీ రిజర్వేసన్ విషయంలో తీర్పు రాకపోతే కాంగ్రెస్ పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేసైనా ఎన్నికలకు పోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 18 నెలలు అవుతోంది. మొదటి సారిగా నాలుగెకరాలకు పైబడి భూమి కలిగిన రైతులకు కూడా రైతు భరోసాను జమ చేసిం ది. దీన్ని అనుకూలంగా మార్చుకొని ఎన్నికల్లో గెల వాలని అధికార పార్టీ ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది.