Share News

వృత్తి నైపుణ్యంతో విధుల్లో రాణింపు

ABN , Publish Date - Jun 21 , 2025 | 12:59 AM

వృత్తి నైపుణ్యంతో ప్రతిఒక్కరూ విధుల్లో రాణిస్తారని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. డీజీపీ ఆదేశాలతో జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో జిల్లా పోలీస్‌ అధికారులకు, సిబ్బందికి జిల్లాస్థాయి పోలీస్‌ డ్యూటీ మీట్‌ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు.

 వృత్తి నైపుణ్యంతో విధుల్లో రాణింపు
డ్యూటీ మీట్‌ను ప్రారంభిస్తున్న ఎస్పీ అశోక్‌కుమార్‌

ఎస్పీ అశోక్‌కుమార్‌

జగిత్యాల, క్రైం 20 (ఆంధ్రజ్యోతి): వృత్తి నైపుణ్యంతో ప్రతిఒక్కరూ విధుల్లో రాణిస్తారని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. డీజీపీ ఆదేశాలతో జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో జిల్లా పోలీస్‌ అధికారులకు, సిబ్బందికి జిల్లాస్థాయి పోలీస్‌ డ్యూటీ మీట్‌ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ న్యాయ నిరూపణ జరగాలంటే సరైన ఆధారాలు, నేర దర్యాప్తు చాలా కీలకమైందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం కేసుల దర్యాప్తులో మెళుకువలు నేర్చుకునేందుకు పోలీస్‌ డ్యూటీ మీట్‌ దోహదపడుతుందన్నారు. ఆలోచనల మార్పిడికి చక్కని వేదిక అన్నారు. డ్యూటీ మీట్‌ విజేతలకు మంచి గుర్తింపు ఉంటుందన్నారు. డ్యూటీ మీట్‌లో పోలీస్‌ అధికారులు నిరంతరం నిర్వహించే విధులకు సంబందించి వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా కంప్యూటర్‌, ఫోరెన్స్‌క్‌ సైన్స్‌, ఫింగర్‌ ప్రింట్‌, హ్యాండ్లీంగ్‌, ప్యాకింగ్‌ లిప్టింగ్‌, బాంబ్‌ డిస్పోజల్‌, పోలీస్‌ జాగిలాల విభాగంలో ట్రాకింగ్‌, ఎక్స్లోజీవ్‌ విబాగాల్లో ఫొటో, వీడియోగ్రఫీ, పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ భీంరావు, డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్‌, రాములు, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌, రఫీఖాన్‌, శ్రీధర్‌, సుధాకర్‌, రవి, సురేష్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు కిరణ్‌కుమార్‌, వేణు, సైదులు, ఎస్సైలు పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2025 | 12:59 AM