Share News

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Dec 10 , 2025 | 12:25 AM

జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాం త వాతావరణంలో పారదర్శకంగా మొదటి విడత ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్‌ శాఖపరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్పీ మహేష్‌ బీ గితే తెలి పారు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం

సిరిసిల్ల, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాం త వాతావరణంలో పారదర్శకంగా మొదటి విడత ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్‌ శాఖపరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్పీ మహేష్‌ బీ గితే తెలి పారు. మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎన్నికల విధుల్లో భాగంగా పోలీస్‌ అధికారులు, సిబ్బందికి ఎన్నికల విధులపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా మొదటి విడత ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్‌ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మొదటి విడత ఎన్నికల కోసం 25 రూట్‌ మొబైల్స్‌, ఏడు ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారితో జోనల్‌ టీమ్స్‌, ఐదు క్విక్‌ రియాక్షన్‌ టీమ్స్‌, రెండు స్ట్రయికింగ్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశామన్నారు. 700 మంది పోలీస్‌ సిబ్బందిని ఎన్నికల నిర్వహణలో వినియోగిస్తున్నామన్నారు. పో లింగ్‌ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది పోలింగ్‌ కేంద్రాన్ని పోలింగ్‌ సమయంలో,కౌంటింగ్‌ సమయంలో ఎట్టి పరిస్థితులలోనూ వదిలి వెళ్లవద్దని, రూట్‌ మొబైల్‌ అధికారులు తరచు తనకు కేటాయించిన రూట్లలలో పెట్రోలింగ్‌ నిర్వహించాలని ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రాలవద్ద, రూట్‌లలో పోలింగ్‌ ప్రశాం త వాతావరణానికి భంగం కలిగే ఏ చిన్న సంఘటన ఎదురైనా అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 10 , 2025 | 12:25 AM