Share News

కాళోజీని ప్రతి ఒక్కరూ స్పూర్తిగా తీసుకోవాలి

ABN , Publish Date - Sep 10 , 2025 | 12:14 AM

ప్రజా కవి కాళోజీ ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ అన్నారు. గళవారం నగరపాలక సంస్థ కార్యాయలయంలో కాళోజీ నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు.

కాళోజీని ప్రతి ఒక్కరూ స్పూర్తిగా తీసుకోవాలి
కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, అధికారులు, ఉద్యోగులు

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రజా కవి కాళోజీ ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ అన్నారు. గళవారం నగరపాలక సంస్థ కార్యాయలయంలో కాళోజీ నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో కలిసి కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగానివాళులర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు ఖాదర్‌ మొహియుద్దీన్‌, వేణుమాధవ్‌, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2025 | 12:14 AM