Share News

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

ABN , Publish Date - Dec 21 , 2025 | 12:25 AM

రోడ్డు భద్రత ప్రజలందరి సామాజిక బాధ్యత అని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని రవా ణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు.

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : రోడ్డు భద్రత ప్రజలందరి సామాజిక బాధ్యత అని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని రవా ణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు-2026పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖ స్పెషల్‌ సీఎస్‌ వికాస్‌ రాజ్‌, లాఅండ్‌ఆర్డర్‌ ఏడీజీ మహేష్‌ ఎం భగవత్‌, జాతీ య రహదారులు, ఆర్టీసీ, పోలీస్‌, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో శనివారం సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల నిర్వహణతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణపై సమీక్షించారు. ఈసందర్భంగా రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడారు. గతంలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించేవారని, గత ఏడాది నుంచి మాసోత్సవాలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి రోజూ రోడ్డు ప్రమాదాల్లో 18 నుంచి 20 మంది మృతిచెందుతున్నారని వెల్లడించారు. గత ఏడాది7949 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందా రని తెలిపారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవా లపై ఈనెల ఆఖరులోగా జిల్లా స్థాయిలో రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించాలని, ఈ కార్యక్రమం నిర్వహణపై యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలని ఆదేశిం చారు. నేషనల్‌ హైవే, ఆర్‌అండ్‌బీ, పీఆర్‌, పోలీస్‌, రవా ణా శాఖా అధికారులు సంయుక్తంగా జిల్లాలోని బ్లాక్‌ స్పాట్లను గుర్తించాలని సూచించారు. అన్ని శాఖల అధి కారుల సమన్వయంతో విజయవంతం చేయాలని పిలు పునిచ్చారు. భద్రత మాసోత్సవాలపై విద్యార్థులకు వివి ధ పోటీలను నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, స్వచ్ఛంద సంస్థల సహకా రం తీసుకోవాలని, నెలరోజులపాటు ట్రాఫిక్‌ వలంటీర్ల ను నియమించాలని సూచించారు. అనంతరం వారిని అభినందిస్తూ సర్టిఫికెట్‌ అందించాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు దగ్గరలోని ఆసుపత్రిలో వైద్యం అందించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిం దని, రోడ్డు ప్రమాద బాధితుల వైద్యానికి కేంద్ర ప్రభు త్వం ఆర్థికసహాయం అందిస్తుందన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన వారికి పారితోషికం ఇస్తుందని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు.

డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం

- ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా లోని రహదారి భద్రతపై వాహ నాల డ్రైవర్‌లకు అవగాహన సద స్సులు నిర్వహిస్తామని జిల్లా ఇన్‌ చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలి పారు. జిల్లాలోని అన్ని విద్య సంస్థ ల్లో విద్యార్థులకు వ్యాస రచన, డ్రాయింగ్‌ ఇతర పోటీలు చేపడతామని పేర్కొన్నారు. స్కూల్‌ మేనేజ్మెంట్‌ సమావే శాల్లో ఈ అంశంపై చర్చిస్తామని వివరించారు. నేషనల్‌ హైవే, ఆర్‌అండ్‌బీ, పీఆర్‌, పోలీస్‌, రవాణా శాఖా అధికా రులు సంయుక్తంగా సర్వేలు నిర్వహించి, బ్లాక్‌ పాయిం ట్‌లను గురించి వాటి పరిష్కారానికి ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య, జిల్లా రవాణా శాఖా అధికారి లక్ష్మణ్‌, జిల్లా రోడ్‌ సేఫ్టీ కమిటీ సభ్యుడు సంగీతం శ్రీనాథ్‌, పీఆర్‌ ఈఈ సుదర్శన్‌ రెడ్డి, ఆర్‌అండ్‌ బీ డీఈ శాంతయ్య, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్‌ కమిషనర్లు ఖదీర్‌ పాషా, అన్వేష్‌, జిల్లా వైద్యాధికారి రజిత, విద్య శాఖా అధికారులు, ట్రాఫిక్‌ పోలీస్‌లు తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 12:25 AM