రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి
ABN , Publish Date - Oct 28 , 2025 | 11:22 PM
రక్తదానంపై ఉన్న అపోహలను నమ్మకుండా ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముం దుకు రావాలని ఎస్పీ మహేష్ బి. గీతే అన్నారు.
సిరిసిల్ల క్రైం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రక్తదానంపై ఉన్న అపోహలను నమ్మకుండా ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముం దుకు రావాలని ఎస్పీ మహేష్ బి. గీతే అన్నారు. పోలీస్ అమరవీ రుల త్యాగాలకు నివాళిగా రక్తదాన శిబిరం నిలుస్తుందన్నారు. మంగ ళవారం సిరిసిల్ల పట్టణంలోని కల్యాణలక్ష్మి గార్డెన్‌లో పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన మెగా రక్త దాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి రక్తదానం చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో స మానమన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి జీవితాలను కాపాడడంలో రక్తదానం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. విధి నిర్వహాణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగా లను సమాజం ఎప్పటికీ మరువదన్నారు. వారి జ్ఞాపకార్తమే ప్రతి ఏటా పోలీస్ ప్లాగ్ డే నిర్వహిస్తున్నామన్నారు. పోలీసు లు శాంతిభద్రతలను పరిరక్షించడమే కాకుండా సేవా కార్యక్ర మాల్లోనూ ముందు వరుసలో ఉంటారన్నారు. మనం చేసే రక్తదానం వలన అత్యవసర సమయాల్లో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 460మంది స్వచ్ఛందంగా యువత, ప్రజలు ఆటో డ్రైవర్‌లు, పోలీస్ అఽధికారులు, సిబ్బంది, తదితరులు తరలివచ్చి రక్త దానం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని ఎస్పీ అభినం దించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సీఐలు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, నాగేశ్వర్‌రావు, మధుకర్, నటేశ్, ఆర్‌ఐలు మధుకర్, రమేశ్, యాదగిరి, డాక్టర్ సంధ్యారాణి, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు గుడ్ల రవి, పెండ్యాల కేశవరెడ్డి, బుస్స ఆంజనేయులు, అసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.