Share News

ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలను పాటించాలి

ABN , Publish Date - Dec 28 , 2025 | 12:30 AM

ప్రతి ఒక్కరు ట్రాఫిక్‌ రూల్స్‌, రోడ్డు నిబంధనలను తప్పకుండా పాటించాలని వేములవాడ ఏఎస్పీ కొట్టే రుత్విక్‌ సాయి వ్యాపారులకు, వాహనదారులకు సూచించారు.

ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలను పాటించాలి

వేములవాడ, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరు ట్రాఫిక్‌ రూల్స్‌, రోడ్డు నిబంధనలను తప్పకుండా పాటించాలని వేములవాడ ఏఎస్పీ కొట్టే రుత్విక్‌ సాయి వ్యాపారులకు, వాహనదారులకు సూచించారు. పట్టణంలోని బైపాస్‌ రోడ్డులోని కూరగాయాల మార్కెట్‌లో రోడ్డు అక్రమణలపై ప్రజల కు అవగహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ రోడ్డును ఆక్రమించి వ్యాపారులు రోడ్డు మీద వ్యాపారం చేస్తే ఊరుకునేది లేదని, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగ కుండా రోడ్డు పక్కన మాత్రమే వ్యాపారం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగేలా రహదారులపై వ్యాపారాలు కొనసాగితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, వ్యాపారులకు పోలీసు శాఖకు సహకరించాలని సూచించారు. ఆయన వెంట సీఐలు వీరప్రసాద్‌, శ్రీనివాస్‌ పోలీసు సిబ్బంది ఉన్నారు.

Updated Date - Dec 28 , 2025 | 12:30 AM