ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలి..
ABN , Publish Date - Nov 26 , 2025 | 12:02 AM
రోడ్డు భద్రత నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, అవగాహనతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్లో కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ నిర్వహించారు.
కరీంనగర్ క్రైం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రోడ్డు భద్రత నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, అవగాహనతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్లో కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారించేందుకు అన్ని శాఖల అధికారులు సమష్టిగా కృషి చేయాలన్నారు. వాహనదారులు, ప్రజలు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని సూచించారు. పరిసరాలను గమనిస్తూ డైవ్రింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు.
ఫ రోడ్డు ప్రమాదాల నివారణకు బహుముఖ వ్యూహం..
- సీపీ గౌస్‌ఆలం
జిల్లాలో రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నియంత్రించేందుకు పోలీస్ శాఖ తరఫున బహుముఖ వ్యూహం అమలు చేస్తున్నామని పోలీస్‌కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. హైదరాబాద్, వరంగల్, జగిత్యాల, సిరిసిల్ల, చొప్పదండి రహదారులపై ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించామన్నారు. ఆయా రహదారుల్లో బ్లాక్ స్పాట్లను గుర్తించామని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రమాదాలకు ముఖ్య కారణం అతివేగం, నిర్లక్ష్యంగా మద్యం తాగి డైవ్రింగ్ చేయడమేనని తెలిపారు. కరీంనగర్‌లో ట్రాఫిక్ సిగ్నల్స్ అన్ని పనిచేసేలా అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తున్న వారిని గుర్తించి జరిమానా విధిస్తున్నామని సీపీ తెలిపారు. రోడ్డు ప్రమాదాలు నివారణకే డీజీపీ శివదర్‌రెడ్డి అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారని, ఈ కార్యక్రమాన్ని జిల్లాలో విస్తృతంగా చేపడుతున్నామని సీపీ గౌస్ ఆలం తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్టీవో శ్రీకాంత్ చక్రవర్తి, ఏసీపీలు విజయకుమార్, వెంకటస్వామి, శ్రీనివాస్ జి, యాదగిరిస్వామి పాల్గొన్నారు.