Share News

పెండింగ్‌ కేసుల పరిష్కారంలో ప్రతి ఒక్కరిది కీలక పాత్ర..

ABN , Publish Date - Jun 22 , 2025 | 12:39 AM

పెండింగ్‌ కేసుల పరిష్కారంలో ప్రతి ఒక్కరి కీలకపాత్ర ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ అ న్నారు.

పెండింగ్‌ కేసుల పరిష్కారంలో ప్రతి ఒక్కరిది కీలక పాత్ర..

సిరిసిల్ల క్రైం, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): పెండింగ్‌ కేసుల పరిష్కారంలో ప్రతి ఒక్కరి కీలకపాత్ర ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ అ న్నారు. శనివారం జిల్లాకోర్టు హాలులో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 14న నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌ సందర్భంగా జిల్లాలో పెండింగ్‌ కేసుల పరిష్కారంలో ప్రత్యేక చొరవచూపిన వారికి ఆమె ప్రశం సాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్‌ కేసులను పరిష్కరించడలో పోలీసు, న్యాయశాఖ, న్యాయాధికార సంస్థ, న్యాయవాదుల పాత్ర ఎంతో ఉందన్నారు. ఇందులో భాగస్వాములైన వారందరు అభినందనీయులన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జిలు రాధిక జైస్వాల్‌, లక్ష్మణాచారి, ప్రిన్సిపల్‌జూనియర్‌ సివిల్‌ జడ్జి ప్రవీ ణ్‌, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి సృజన, రెండవ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి మేఘన, అడిషనల్‌ఎస్పీ చంద్రయ్య, సీఐలు, ఎస్‌ఐలు ఉన్నారు.

Updated Date - Jun 22 , 2025 | 12:39 AM