అభ్యర్థుల గెలుపునకు ప్రతి కార్యకర్త కష్ట పడాలి
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:32 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ ఎస్ అభ్యర్థుల గెలుపునకు ప్రతి కార్యకర్త కష్టపడాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.
ఎల్లారెడ్డిపేట, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ ఎస్ అభ్యర్థుల గెలుపునకు ప్రతి కార్యకర్త కష్టపడాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలు లో ఆదివారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన బాకీ కార్డుపై ప్రజలకు వివరించి చైతన్యపర్చాల ని అన్నారు. ఎన్నికల్లో అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని గెలుపు గుర్రాలకు టిక్కెట్లను కేటాయించేందుకు ప్రయత్నం జరుగుతోందని అన్నారు. టిక్కెటు లభించని వారు నిరాశ చెందవద్దని, రాబోయే రోజుల్లో తగిన గుర్తింపునిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత చోటు చేసుకుందని రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తోందని స్పష్టం చేశారు. మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాలకు ముగ్గురి కంటే అధికంగా టిక్కెట్టు ఆశిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల గ్రామాల్లో నిర్వహించిన సర్వేల అధారం గా 95 శాతానికి పైగా సీట్లను బీఆర్‌ఎస్ కైవసం చేసుకోనుందని అన్నారు. జడ్పీటీసీ స్థానానికి పోటీపడుతున్న వారిని గుర్తించామని పేర్కొన్నారు. ఉత్సా హం ఉండి పోటీ చేయదలిచే వారు తమ దృష్టికి తీసుకు వస్తే పరిశీలిస్తామ న్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆగయ్య కోరారు. సమావేశంలో సెస్ డైరెక్టర్, మండల అధ్యక్షుడు కృష్ణహరి, ప్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, తాజా, మాజీ ఎంపీపీ రేణుక, నాయకులు సందీప్, సుభాష్ పాల్గొన్నారు.