Share News

యూడైస్‌, అపార్‌అప్డేట్‌ ప్రక్రియ వేగంగా చేపట్టాలి

ABN , Publish Date - Nov 15 , 2025 | 12:14 AM

జిల్లాలోని అన్ని విద్యాలయాలల్లో యూడైస్‌, అపార అప్డేట్‌ల ప్రక్రియల ను వేగంగా పూర్తిచేయాలని ఇన్‌చార్జీ కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌ ఆదేశించారు.

యూడైస్‌, అపార్‌అప్డేట్‌ ప్రక్రియ వేగంగా చేపట్టాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, నవంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని అన్ని విద్యాలయాలల్లో యూడైస్‌, అపార అప్డేట్‌ల ప్రక్రియల ను వేగంగా పూర్తిచేయాలని ఇన్‌చార్జీ కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం యూడైస్‌, అపార్‌అప్డేట్‌ల ప్రక్రియపై రెసిడెన్షియల్‌ విద్యాలయాలలు, కేజీబీవీలు తదితర అంశాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భం గా ఇన్‌చార్జి కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలోని వివిధ విద్యాల యాలు 628 ఉన్నాయని అన్ని పాఠశాలల్లో యూడైస్‌, అపార్‌ అప్డేట్‌ వంద శాతం పూర్తిచేయాలని ఆదేశించారు. బర్త్‌ సర్టిఫి కేట్‌ జారీలో ఏమైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత ఆర్డీవో, తహసీల్దార్‌లు, మున్సిపల్‌ కమిషనర్‌ల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ ప్రక్రియ వంద శాతం పూర్తిచేస్తే ప్రతి ప్రభు త్వ పథకం అమలు, వసతుల కల్పన, సిబ్బంది నియామాకం నిధుల మంజూరుకు ఎంతో కీలకమని తెలిపారు. స్కూల్స్‌, కాలేజీల భాధ్యులు ప్రణాళిక ప్రకారం పనిని పూర్తి చేయాలని ఆదేశించారు. ఇటుకబట్టీలు, రైస్‌మిల్లులు, క్వారీలు, తదితర స్థలాల్లో పనిచేస్తున్న కూలీల పిల్లలకు వర్క్‌సైట్‌ స్కూల్స్‌ ఏర్పాటుచేయాలని, పిల్లలకు విద్యను అందించాలని కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. బాల కార్మికులు, బిక్షాటన చేస్తూ పిల్లలు కనిపించకూడదని స్పష్టం చేశారు. కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, కావాల్సిన వసతులపై ఆరా తీశారు. పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని సూచించారు. ప్రతి విద్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావే శంలో జిల్లా విద్యాధికారి వినోద్‌కుమార్‌, డీటీ డబ్ల్యూవో సంగీత, జీసీడీ వో పద్మజ, మైనార్టీ సంక్షేమాధికారి ఎంఏ భారతి, కార్మిక శాఖ అధికారి నజీర్‌అహ్మద్‌, కేజీబీవీ ఎస్‌వోలు,ఈఎంఆర్‌ఎస్‌ ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 12:14 AM