Share News

రైతులు నష్టపోకూడదనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు..

ABN , Publish Date - Apr 10 , 2025 | 01:00 AM

రైతులు దళారీల బారినపడి నష్టపోవద్దనే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.

రైతులు నష్టపోకూడదనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు..

ఇల్లంతకుంట, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): రైతులు దళారీల బారినపడి నష్టపోవద్దనే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. పొద్దుతిరుగుడు పంటను సాగుచేసిన రైతులు ధాన్యాన్ని అమ్ముకోవడానికి పడుతున్న ఇబ్బందులను ఈనెల 3న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన పొద్దుతిరుగుడు కొనేదెన్నడు అనే కథనానికి స్పందన లభించింది. మండలకేంద్రంలోని మార్కెట్‌ శాఖ కార్యాలయ ఆవరణలో బుధవారం కొనుగోలు కేంద్రం ప్రారంభమయ్యింది. కార్యక్రమంలో ఏఎమ్‌సీ చైర్‌పర్సన్‌ ఐరెడ్డి చైతన్యమహేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ప్రసాద్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ అయిలయ్య, ఏపీఎం వాణీశ్రీలతో పాటు ఏఎమ్‌సీ డైరెక్టర్లు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 01:00 AM