ధాన్యం డబ్బులు త్వరగా జమ అయ్యేలా చూడాలి
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:35 AM
ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల నుంచి 72 గంటల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులను జమచేయడానికి వీలుగా కలెక్టర్ శ్రద్ధ చూపాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల నుంచి 72 గంటల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులను జమచేయడానికి వీలుగా కలెక్టర్ శ్రద్ధ చూపాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ సచివాలయం నుంచి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులతో ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లా డుతూ ధాన్యం దిగుబడిలో తెలంగాణ రాష్ట్ర ఆల్‌టైం రికార్డు లను సృష్టించిందన్నారు. జిల్లాలో ఏర్పాటుచేసే ధాన్యం కొను గోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు ఇబ్బందులకు లేకుండా కొనుగోలు చేపట్టడంతోపాటు మౌలిక వసతులను కల్పించాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలిం చేందుకు పూర్తిస్థాయిలో రవాణా వసతి ఏర్పాటు చేసుకోవాలని ఆదే శించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి 48గంటల నుంచి 72 గంటలల్లో చెల్లింపులు చేపట్టాల న్నారు. మద్దతు ధరతో పాటు సన్నాలకు బోనస్‌లను అందిస్తామని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిరీక్షించ కుండా చర్యలు చేపట్టడంతో పాటు కొనుగోలుకు సంబంధించిన అన్ని పరికరాలను అమర్చుకోవాలన్నారు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. వాతావరణం మార్పులు, వర్ష సూచనలను పౌరసరఫ రాల అధికారులు ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాల న్నారు. వర్షం వస్తే ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు అవసరమైన టార్పాలిన్ కవర్లను ఏర్పాటు చేసుకుని అందుబాటులో ఉంచుకోవాల న్నారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే తమ దృష్టికి తీసుకొని రావా లని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఎదురైతే 1800 425 00333/1967 హెల్ప్‌లైన్ నంబర్‌లకు ఫోన్ చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగిసేవరకు జిల్లా కేంద్రం నుంచి కొను గోలు కేంద్రాల వరకు ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేయా లని ఆదేశించారు. ఈ వీడియో కాన్పరేన్స్‌లో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల అర్డీవో వెంకటేశ్వర్లు, డీఆర్‌డీవో శేషాద్రి, డీసీఎస్‌వో చంద్రప్రకాష్, డీఎం రజిత, డీఏవో అఫ్జల్‌బేగం, డీసీవో రామకృష్ణ, మోప్మా ఏవో మీర్జాఫసహత్ అలీబేగ్ తదితరులు పాల్గొన్నారు.