‘స్వశక్తి’కి ప్రోత్సాహం
ABN , Publish Date - Jul 16 , 2025 | 02:05 AM
మహిళలను కోటీశ్వరులుగా మారుస్తామన్న కొత్త ప్రభుత్వం వివిధ పథకాలతో స్వశక్తి సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధిపై దృష్టి పెట్టింది. వడ్డీ రాయితీని విడుతల వారీగా విడుదల చేస్తోంది.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
మహిళలను కోటీశ్వరులుగా మారుస్తామన్న కొత్త ప్రభుత్వం వివిధ పథకాలతో స్వశక్తి సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధిపై దృష్టి పెట్టింది. వడ్డీ రాయితీని విడుతల వారీగా విడుదల చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలోని పేరుకుపోయిన బకా లు చెల్లించకుండా కొత్త బకాయిల చెల్లింపుపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే డిసెంబర్-2023 నుంచి 2024మార్చి వరకు ఉన్న బకాయిల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా స్వశక్తి సంఘాలకు రూ. 7.39 కోట్లు విడుదల చేసింది. మళ్లీ మహిళా శక్తి పథకం కింద 2024-25 సంవత్సరానికి సంబంధించిన గత సంవ త్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల బకాయిలు 8,552 సంఘాలకు రూ. 11.77 కోట్లు విడుదలయ్యాయి. మున్సిపాలిటీలు సంబంధించి 1,182 సంఘాలు రూ.2.13 కోట్లు మంజూరు చేశా రు. ఎన్‌యుఎల్‌ఎం కింద 1,088 సంఘాలకు రూ 2.51 కోట్లు మంజూరు ఇచ్చారు. ఇందులో సిరిసిల్ల మున్సిపాలిటీలో 810 సంఘాలకు రూ.1.13 కోట్లు, వేములవాడలో 372 సంఘాలకు రూ. 42.47 లక్షలు స్వశక్తి సంఘాలకు వడ్డీ రాయితీ విడుదల చేశారు.
ఫ మహిళా సంఘాలకు యూనిట్లు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళా శక్తి పథకం ద్వారా డెయిరీ యూనిట్లు, అయిల్ మిల్, పెరటి కోళ్ల పెంపకం, ఆర్టీసీ బస్సులు, కుట్టు మిష న్ కేంద్రం, బేకరీలు, గిఫ్ట్ అర్టికల్స్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, మొబైల్ టిఫిన్ సెంటర్‌లు, రిటైల్ ఫిష్ అవుట్‌లెట్‌లు, చట్నీస్, స్నాక్స్ వంటి యూనిట్లు ప్రారంభించుకున్నారు. తాజాగా విడుదలైన వడ్డీ మాఫీ డబ్బులు 8,552 సంఘాలకు రూ.11.77 కోట్లు సంఘాల ఖాతాల్లో జమ చేస్తున్నారు. స్వశక్తి సంఘాల ద్వారా 2012 సంవత్సరంలో పావలా వడ్డీ రుణాలను అందించడం అప్పటి ప్రభుత్వం మొదలు పెట్టింది. తర్వాత వడ్డీ లేని రుణాలగా మార్చింది. ఇప్పటి వరకు జిల్లాలో 9,070 సంఘాలు రూ. 61.02 కోట్ల వడ్డీ రాయితీ పొందారు. 2014-2015లో 7048 సంఘాలకు రూ.5.83 కోట్లు, 2015-2016లో 7,181 సంఘా లకు 4.95 కోట్లు, 2016-2017లో 7,547సంఘాలకు 7.33 కోట్లు, 2017-2018లో 7,918 సంఘాలకు 6.69 కోట్లు,2018-2020లో 9,070 సంఘాలకు రూ.17.03 కోట్లు, కాంగ్రెస్ ప్రభుత్వంలో 2023-2024లో రూ 7,802 సంఘాలకు రూ 7.39కోట్లు, 2024-2025లో రూ. 8,552 సంఘాలకు రూ. 11.77 కోట్లు రాయితీ అందుకున్నారు.
ఫ పాత బకాయిలు రూ. 68.66 కోట్లు
మహిళలు స్వశక్తిగా ఎదగడానికి ఆర్థికాభివృద్ధికి పొదుపు సంఘాలు బాటలు వేసినా ప్రభుత్వం నుంచి రావాల్సిన వడ్డీ రాయితీ కోసం మహిళా సంఘాల సభ్యులకు నిరీక్షణ తప్పడం లేదు. పాత బకాయిల జోలికి కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్లకపోవడంతో నిరీక్షణ తప్పదా అని మహిళ సంఘాలు భావిస్తున్నాయి. జిల్లాలో 2020- 21 నుంచి 2022 - 23 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన వడ్డీ రాయి తీ బకాయిలు రూ. 68.66 కోట్లకు చేరుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 9,963 స్వశక్తి సంఘాలు, 411 గ్రామ సంఘాలు, 12 మండల సంఘాలు, వీటికి అనుసంధానం చేస్లూ జిల్లా సమాఖ్య కూడా పనిచేస్తుంది. స్వశక్తి సంఘాల పరిధిలో దాదాపు 1,12,637 మంది సభ్యులు ఉన్నారు. గ్రామీణాభివృద్ధి సంస్థ వీరికి ప్రతి సంవత్సరం కోట్లలోనే వడ్డీలేని రుణాలను అందిస్తోంది. స్వశక్తి సంఘాలకు బ్యాంక్ లింకేజీ అందించడంలో ఇబ్బందులు లేకపోయినా వడ్డీ రాయితీ మాత్రమే భారంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో 9,755 స్వశక్తి సంఘాలకు రూ 68.66 కోట్లు వడ్డీ రాయితీ రావాల్సి ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 9051 సంఘాలకు రూ 20.67 కోట్లు రాయితీ రావాల్సి ఉండగా 2021- 22లో 9001 సంఘాలకు రూ. 25.78 కోట్లు, 2022- 23 సంవత్సరంలో 9,755 సంఘాలకు రూ. 22.21 కోట్లు వడ్డీ రాయితీ రావాల్సి ఉంది.