ఉద్యోగులు సంఘటితంగా ఉండాలి
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:01 AM
గ్రామీణ తపాలా ఉద్యోగులు సంఘటితంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలని ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ తెలంగాణ సర్కిల్ సెక్రెటరీ బండి జయరాజ్ అన్నారు.
భగత్‌నగర్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ తపాలా ఉద్యోగులు సంఘటితంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలని ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ తెలంగాణ సర్కిల్ సెక్రెటరీ బండి జయరాజ్ అన్నారు. కరీంనగర్‌లో యూనియన్ ద్వైవార్షిక సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు రావాల్సిన సదుపాయాలపై ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తామన్నారు. ఇప్పటి వరకు సాధించుకున్న హక్కులు సంఘ పోరాట ఫలితమే అన్నారు. తెలంగాణ సర్కిల్‌లో అత్యధిక సభ్యత్వం ఇచ్చి కరీంనగర్ డివిజన్‌ను ముందజలో ఉంచాలన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం అందుబాటులో ఉంటూ అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గంగాధర్, కార్యదర్శిగా సుధాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహిళా విభాగం అధ్యక్షురాలిగా రేణుక, సెక్రెటరీగా రజిత, కోశాధికారిగా హారిక ఎన్నికయ్యారు. సమావేశంలో ఏఐజీడీఎస్ తెలంగాణ సర్కిల్ కోశాధికారి అంజనేయులు, వివిధ విభాగాల ముఖ్య నాయకులు రమేష్, రాచంద్రం, దిలీప్ పాల్గొన్నారు.