సీపీఆర్‌పై ఉద్యోగులకు అవగాహన ఉండాలి
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:32 AM
జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు సీపీఆర్‌పై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అన్నారు.
సిరిసిల్ల కలెక్టరేట్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు సీపీఆర్‌పై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అన్నారు. సిరిసిల్ల కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సీపీఆర్ చేసి చూపించగా, ప్రభుత్వ వైద్యకళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగార్జున అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందరికి సీపీఅర్ ప్రక్రియపై అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. కార్డియాక్ అరెస్టు అయిన వారి వివరాలు 108అంబులెన్స్‌కు సమాచారమి స్తూ వాహనం వచ్చే వరకు సీపీఅర్ చేస్తే ప్రాణాన్ని కాపాడవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత తదితరులు పాల్గొన్నారు.