ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Apr 04 , 2025 | 11:44 PM
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మెన్ దారం శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సుడా చైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డికి వినతిపత్రం శుక్రవారం అందజేశారు.

సుభాష్‌నగర్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మెన్ దారం శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సుడా చైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డికి వినతిపత్రం శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి సమర్థవంతంగా అమలు చేసేది ప్రభుత్వ ఉద్యోగులేనని అన్నారు. వారి సంక్షేమాన్ని చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. తమకు న్యాయబద్ధంగా రావలసిన జీతభత్యాలు, పెండింగ్ బిల్లులు, ఐదు డీఏలు, పీఆర్సీ, హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. తాము దాచుకున్న డబ్బు తమకు రాకపోయేటప్పటికి ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం సుడా చైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ మడిపెల్లి కాళీచరణ్, నాయకులు నాగుల నరసింహస్వామి, రాగి శ్రీనివాస్, గూడ ప్రభాకర్‌రెడ్డి, సర్దార్ హర్మిందర్‌సింగ్, కిరణ్‌కుమార్‌రెడ్డి, కోట రామస్వామి, రాజేశ్‌భరద్వాజ్, సుమంత్‌రావు, శంకర్, శారద, సునీత, తిరుపతి, గంప చంద్రశేఖర్, కరుణాకర్‌రెడ్డి, మర్రి జయపాల్‌రెడ్డి, వెలిచాల వెంకటస్వామి, ఎల్ కనకయ్య, జి శ్రీనివాస్, కుమార్, ప్రేమ్‌సాగర్, హర్‌ప్రీత్‌కౌర్ పాల్గొన్నారు.