Share News

విద్యుత్‌ బ్యాక్‌ బిల్లింగ్‌ను రద్దు చేయాలి

ABN , Publish Date - Aug 30 , 2025 | 01:03 AM

సిరిసిల్ల వస్త్ర పరి శ్రమల విద్యుత్‌ బ్యాక్‌ బిల్లింగ్‌లను రద్దుచేయాలని పాలిస్ట్రర్‌ ఉత్ప త్తిదారుల సంఘం అధ్యక్షుడు అడెపు భాస్కర్‌, చేనేత వస్త్ర వ్యాపా ర సంఘం అధ్యక్షుడు తాటిపాముల దామోదర్‌, పద్మశాలి సం ఘం అధ్యక్షుడు దూడం శంకర్‌, సీసీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్‌, సీపీఐ పట్టణ కార్యదర్శి పంతం రవిలు డిమాండ్‌ చేశారు.

విద్యుత్‌ బ్యాక్‌ బిల్లింగ్‌ను రద్దు చేయాలి

సిరిసిల్ల రూరల్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల వస్త్ర పరి శ్రమల విద్యుత్‌ బ్యాక్‌ బిల్లింగ్‌లను రద్దుచేయాలని పాలిస్ట్రర్‌ ఉత్ప త్తిదారుల సంఘం అధ్యక్షుడు అడెపు భాస్కర్‌, చేనేత వస్త్ర వ్యాపా ర సంఘం అధ్యక్షుడు తాటిపాముల దామోదర్‌, పద్మశాలి సం ఘం అధ్యక్షుడు దూడం శంకర్‌, సీసీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్‌, సీపీఐ పట్టణ కార్యదర్శి పంతం రవిలు డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల పట్టణంతో పాటు చంద్రంపేట, తంగళ్లపల్లి గ్రామాల్లో శుక్రవారం సెస్‌ అధికారులు వస్త్ర పరిశ్రమలపై దాడులు చేసి బిల్లులు చెల్లించాలంటూ విద్యుత్‌కనెక్షన్‌లను తొలగించారు. ఆగ్ర హించిన వస్త్రవ్యాపారులు సెస్‌ ప్రధాన కార్యాలయానికి చేరుకుని చైర్మన్‌తోపాటు ఎండీతో మాట్లాడేందుకు ప్రయత్నించగా, ఎవరు పట్టించుకోకపోవడంతో జేఏసీ నాయకులతో కలిసి వస్త్ర వ్యాపారు లు కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ధర్నా చేస్తుండగా సెస్‌ చై ర్మన్‌ చిక్కాల రామారావు కార్యాలయానికి వచ్చిన వారిని పట్టించుకో కపోవడంతో అగ్రహంతో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. జేఏసీ నాయకులతో కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్‌ కేకే మహేందర్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కారిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. ఈసందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ సిరిసి ల్లలో ఇందిరా స్వశక్తి మహిళా చీరల ఉత్పత్తిని అడ్డుకుని ప్రభుత్వానికి చెడ్డపేరును తేవడం కోసమే సెస్‌ పాలకవర్గం వస్త్ర పరిశ్రమలపై కక్ష పూరిత వైఖరిని చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా బదనాం చేయడంలో భగంగానే అనేక రకాల నిబంధనలను పెడుతూ ఈ నాలుగు నెలల్లోనే నాలుగు సార్లు కనెక్షన్లను తొలగించారన్నారు. వస్త్రపరిశ్రమలపై సెస్‌ పాలకవ ర్గం, అధికారులు కక్షపూరిత వైఖరిని అవలంభిస్తూ, బ్యాక్‌ బిల్లింగ్‌, సర్‌ చార్జీలతో పాటు ఇతరత్రా బిల్లుల పేరుతో వ్యాపారులను వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. ఇటీవల సిరిసిల్ల పర్యటనకు వచ్చిన చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును ప్రభుత్వ విప్‌ ఆది శ్రీని వాస్‌, కేకే మహేందర్‌రెడ్డిలతో కలిసి బ్యాక్‌ బిల్లులను రద్దుచేయాలని విన్నవించి వినతిపత్రాన్ని అందించామని, అసెంబ్లీ సమావేశాల్లో చ ర్చించి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారన్నారు.సెస్‌ పాలకవర్గం వెంటనే తొలగించిన కనెక్షన్‌లను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వస్త్ర వ్యాపారులు బూట్ల నవీన్‌, ఏనుగుల ఎల్లయ్య, బండారి అశోక్‌, యోల్లండి దేవదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2025 | 01:03 AM