42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలు జరుపాలి
ABN , Publish Date - Oct 17 , 2025 | 11:52 PM
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కరీంనగర్ జిల్లా బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శుక్రవారం టవర్‌సర్కిల్ ప్రాంతంలో శనివారం నిర్వహించనున్న బంద్‌ను విజయవంతం చేయాలని బీసీ సంఘాల ఐక్య వేదిక దండోరా చేపట్టారు.
గణేశ్‌నగర్,అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కరీంనగర్ జిల్లా బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శుక్రవారం టవర్‌సర్కిల్ ప్రాంతంలో శనివారం నిర్వహించనున్న బంద్‌ను విజయవంతం చేయాలని బీసీ సంఘాల ఐక్య వేదిక దండోరా చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ వ్యాపార సంస్థలు సానుకూలంగా స్పందించి బంద్‌కు సహకరిస్తామని తెలిపారన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించడాన్ని వ్యతిరేకిస్తూ అన్ని బీసీ సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి నిరసన తెలుపుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని లేని పక్షంలో బీసీల ప్రతిఘ టన ఎదుర్కొనక తప్పదన్నారు. బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ రెడ్డి జాగృతి నేతలు హైకోర్టులో కేసు వేసి స్టే తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ 18న రాష్ట్ర వ్యాప్త బంద్‌కి పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక నాయ కులు ఎన్నం ప్రకాష్, అది మల్లేశం, కేశిపెడ్డి శ్రీధర్ రాజు, నాగుల కనకయ్య గౌడ్, రాచమల్ల రాజు, రంగు సంపత్ గౌడ్, దొగ్గలి శ్రీధర్, మంతెన కిరణ్, శనగొండ వాసు, మదాసు సంజీవ్, నారోజు రాకేష్ చారి, సిరిశెట్టి రాజేష్, గాలి రవి యాదవ్, పురుషోత్తం ఆశిష్ గౌడ్, పెంట శ్రీనివాస్, నితిన్, గంగిపెల్లి అరుణ, కొత్తకొండ జ్యోతి, దేవరకొండ సంతోషి, తిరుమల తదితరులు పాల్గొన్నారు.