ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలి
ABN , Publish Date - Dec 10 , 2025 | 12:31 AM
గ్రామ పంచాయతీ ఎన్ని కల నేపథ్యంలో ఈనెల 11వ తేదీన మొదటి విడత ఎన్నికలు పోలింగ్, కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చూడాలని ఇన్‌చార్జి కలెక్టర్, ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
సిరిసిల్ల, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : గ్రామ పంచాయతీ ఎన్ని కల నేపథ్యంలో ఈనెల 11వ తేదీన మొదటి విడత ఎన్నికలు పోలింగ్, కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చూడాలని ఇన్‌చార్జి కలెక్టర్, ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి మంగళవారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో చేపట్టా ల్సిన చర్యలపై తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్‌హెచ్‌వోలతో ఎస్పీ మహేష్ బీ గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా ఎన్నికల వ్యయ, సాధారణ పరిశీలకులు రాజ్‌కుమార్, రవి కుమార్, నోడల్ అధికారులతో కలిసి ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 11న మొదటి విడత ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో మద్యం అమ్మకా లు నిషేధం ఉంటుందని వివరించారు. గ్రామంలో బయట వ్యక్తులు ఉండకుండా చూడాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపల పీఓకు తప్ప ఎవరికీ మొబైల్ ఫోన్లు అనుమతి లేదని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల లోపల ప్రచారం కోసం కౌంట ర్లు ఏర్పాటు చేయడానికి అనుమతి లేదని తెలిపారు. మూడు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యేవరకు ఎన్నికల కోడ్ ఉంటుందని, అందరూ గమ నించాలని స్పష్టం చేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీపై సూచనలు చేశారు. అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఎన్నికల అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన వాహనంలోనే సామగ్రితో పోలింగ్ కేంద్రానికి వెళ్లాలని స్పష్టం చేశారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, విద్యుత్ అంతరా యం కలగకుండా చూడాలని ఆయాశాఖల అధికారులను ఆదేశించారు. పోలింగ్ సిబ్బంది విధులకు హాజరయ్యేలా ఎంపీడీవోలు పర్యవేక్షించాల ని, నివేదికలు ఎప్పటికప్పుడు అందించాలని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ శాతం ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని, పారదర్శకంగా కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించాలని ఆదేశిం చారు. ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడు తూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. శాంతిభ ద్రతలు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే అధికారులు వెంటనే తెలియజేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, జడ్పీ సీఈ వో వినోద్ కుమార్, నోడల్ అధికారులు శేషాద్రి, లక్ష్మీరాజం, డీపీవో షరీ ఫుద్దిన్, నవీన్, భారతి తదితరులు పాల్గొన్నారు.