ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలి
ABN , Publish Date - Dec 06 , 2025 | 12:41 AM
పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అశోక్‌కుమార్ సూచించారు.
- ఎస్పీ అశోక్‌కుమార్
మెట్‌పల్లి రూరల్/ఇబ్రహీంపట్నం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అశోక్‌కుమార్ సూచించారు. శుక్రవారం మండలంలోని వెల్లుల్ల, ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఎస్పీ సందర్శించారు. కేంద్రాలకు ప్రహరీ, కరెంట్, మంచినీరు, భద్రతా చర్యలు వంటి పలు అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మొదటి విడత సర్పంచ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బీఎనఎస్‌ఎస్ 163 యాక్ట్ (144)సెక్షన అమలులో ఉంటుందని, ఎన్నికల నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా చట్టవిరుద్ధంగా ప్రవర్తించినా, గొడవలు సృష్టించినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పొలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. ఎన్నికల సమయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మెట్‌పల్లి, కోరుట్ల సీఐలు అనిల్ కుమార్, సురేష్, ఎస్‌ఐలు అనిల్, కిరణ్ కుమార్, శ్రీధర్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.