Share News

విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి

ABN , Publish Date - Nov 14 , 2025 | 12:06 AM

విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, విద్యార్థులకు ఇచ్చిన ఎన్నికల హామీల అమలు చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి ప్రభుతాన్ని డిమాండ్‌ చేశారు. నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో నిర్వాహించిన జిల్లా ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశం గురువారం నిర్వహించారు.

విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి

గణేశ్‌నగర్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, విద్యార్థులకు ఇచ్చిన ఎన్నికల హామీల అమలు చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి ప్రభుతాన్ని డిమాండ్‌ చేశారు. నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో నిర్వాహించిన జిల్లా ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మణికంఠరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23 నెలలు గడిచినా విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ హాస్టళ్లు సమస్యలకు నిలయంగా మారాయన్నాయన్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు దుప్పట్లు రాక చలికాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో పాలకులు విఫలమవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో నిబంధనలకు వ్యతిరేకంగా పని చేస్తున్న ప్రైవేట్‌ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రామారావు వెంకటేష్‌, జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్‌, జిల్లా ఆఫీస్‌ బేరర్‌ ్స మామిడిపల్లి హేమంత్‌, కనకం సాగర్‌, రాము యాదవ్‌, లద్దునూరి విష్ణు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2025 | 12:06 AM