ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
ABN , Publish Date - Nov 26 , 2025 | 12:50 AM
గ్రామపంచాయతీ ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
సిరిసిల్ల, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీ ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్‌ఓ), అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్(ఏఆర్‌ఓ)లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ స్వీకరణ, పరిశీ లన, స్కూట్రినీ,అప్పిళ్ళ పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా మార్గదర్శకాల ప్రకారం చేయాలని సూచించారు. శిక్షణలో డీపీవో శర్ఫుద్దిన్, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి
- ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
గ్రామ పంచాయితీ ఎన్నికల్లో అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ)పై వివిధ శాఖల జిల్లా అధికారులతో మంగ ళవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాజకీ య పార్టీల కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది పాల్గొనకూడదని స్పష్టం చేశారు. విధుల్లో భాగంగా ఎఫ్‌ఎస్టీ, ఎస్‌ఎస్టీలు సీజ్ చేసినప్పు డు తప్పనిసరిగా వీడియో ఫుటేజ్ తీసుకోవాలని, ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని సూచించారు.