ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలి
ABN , Publish Date - Dec 01 , 2025 | 12:26 AM
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్, కరపత్రాలు, ఫ్లెక్సీలు ఇతర ముద్రణలపై రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సూచించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్, కరపత్రాలు, ఫ్లెక్సీలు ఇతర ముద్రణలపై రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సూచించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని పలు మీడియా సంస్థల అడ్వర్టైజ్మెంట్ ప్రతినిధులు, ప్రింటింగ్, ఫ్లెక్సీ ప్రింటింగ్ యజమానులు, బా ధ్యులతో కలెక్టరేట్‌లో ఆదివారం అదనపుకలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మాట్లాడారు. గ్రామపంచా యతీ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో భాగంగా సర్పం చ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచారానికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్, కరపత్రాలు, ఫ్లెక్సీలు ప్రింట్ చేసేందుకు వారి బ్యాంక్ ఖాతా నుంచే డబ్బులు తీసుకోవాలన్నారు. ప్రత్యేక కమిటీ పర్య వేక్షించి, పోటీలో ఉన్న అభ్యర్థుల వ్యయంలో జమ చేస్తారని స్పష్టం చేశా రు. ఈ సమావేశంలో మీడియా సంస్థలు, ప్రింటింగ్, ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రతి నిధులు తదితరులు పాల్గొన్నారు.