Share News

ఎన్నికల ప్రచార ఖర్చులు నమోదు చేయాలి

ABN , Publish Date - Nov 29 , 2025 | 12:34 AM

గ్రామపంచాయతీ ఎన్నికల ప్ర చారం కోసం అభ్యర్థులు చేసే ఖర్చును పకడ్బందీగా నమోదు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌, ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

ఎన్నికల ప్రచార ఖర్చులు నమోదు చేయాలి

సిరిసిల్ల, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : గ్రామపంచాయతీ ఎన్నికల ప్ర చారం కోసం అభ్యర్థులు చేసే ఖర్చును పకడ్బందీగా నమోదు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌, ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. శుక్రవా రం గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సర్పంచ్‌, వార్డు సభ్యులు ప్రచారంలో భాగంగా చేసే వ్య యం వివరాల నమోదుపై సహాయ వ్యయ పరిశీలకులకు శిక్షణ ఇచ్చారు. ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ వ్యయ పరిశీలకులు రాజ్‌కుమార్‌, నోడల్‌ అధికారి శేషాద్రి మాట్లాడుతూ ఎన్నికల్లో వ్యయ పర్యవేక్షణ ఎంతో ముఖ్య మని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఖర్చు విషయమై రిజిస్టర్లు నిర్వహించాల ని ఆదేశించారు. ప్రతి సర్పంచ్‌, వార్డుసభ్యులు ఈ ఎన్నికల వ్యయం కోసం ప్రత్యేక బ్యాంక్‌ ఖాతా ఓపెన్‌ చేయాలని, 5వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామపంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థి వ్యయ పరిమితి రూ 2.50లక్షలు, 5వేల కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థి వ్యయ పరిమితి రూ 1.50లక్షలని వెల్లడించారు. అలాగే 5వేల కంటే ఎక్కు వ జనాభా ఉన్న గ్రామపంచాయతీ వార్డు అభ్యర్థి వ్యయ పరిమితి రూ 50 వేలు, 5 వేల కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామపంచాయతీ వార్డు అభ్యర్థి వ్యయ పరిమితి రూ.30వేలని తెలిపారు. రూ 50వేల కంటే ఎక్కువ నగదు తీసుకువెళ్లవద్దన్నారు. ప్రతి అభ్యర్థికి సంబంధించిన రిజిస్టర్‌ నిర్వహించాల ని ఆదేశించారు. శిక్షణలో డీపీవో షరీఫుద్దిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2025 | 12:34 AM