Share News

వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Aug 24 , 2025 | 01:00 AM

జిల్లాలో వినా యక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సందీ ప్‌కుమార్‌ ఝా అధికారులను ఆదేశించారు.

వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

సిరిసిల్ల కలెక్టరేట్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో వినా యక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సందీ ప్‌కుమార్‌ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివా రం నవరాత్రి ఉత్సవాలు, వినాయక నిమజ్జనం, మిలాద్‌ఉన్‌ నబీ పండుగల సందర్భంగా పీస్‌ కమిటీ సమావేశాన్ని ఎస్పీ మహేష్‌ బీ గీతేతో కలిసి కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 27 నుంచి సెప్టెంబర్‌ 6వ తేదీవరకు జరిగే వినాయక నవరాత్రి ఉత్సవాలు, వినాయక నిమజ్జనం కార్యక్రమాలు సిరిసిల్ల జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా పట్టిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ అధికా రులను అదేశించారు. వేములవాడ పట్టణంలోసెప్టెంబర్‌4, సిరిసిల్లలో సెప్టెంబర్‌ 6న వినాయక నిమజ్జనం జరగాలని, దానికి తగిన విధంగా రెవెన్యూ, నీటిపారుదల, పోలీస్‌, ఫిషరీస్‌, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వినాయక మండపా లకు నిమజ్జనం రోజు విద్యుత్‌ సరఫరా నిరంతరాయంగా కొనసాగాల ని, నిమజ్జనం పాయింట్ల వద్ద పవర్‌ జనరేటర్‌లను సిద్ధం చేయానలి సూచించారు. వినాయక నిమజ్జనానికి ప్రణాళికలను రూపొందించుకో వాలని నిమజ్జనం చేసుకునేందుకు అవసరమైన రూట్‌ మ్యాప్‌లను సిద్ధం చేసుకోవాలన్నారు. నిమజ్జనం రూట్‌లో అవరసమైన రోడ్డు మర మ్మతుల పనులు వెంటనే చేపట్టి పూర్తి చేయాలని కోరారు. సిరిసిల్ల, వేములవాడప్రాంతాల్లో వినాయక నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో మూడు చొప్పున క్రేన్లు, పది మంది చొప్పున గజ ఈతగాళ్లను సిద్ధం చేయాల న్నారు. నిమజ్జనం వద్ద అగ్ని ప్రమాదాలను నివారించేందుకు సిరిసిల్ల పట్టణంలో1, వేములవాడ పట్టణంలో 1 అగ్నిమాపక వాహనాలను ఇతరప్రాంతాలకు టూవీలర్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి వినా యక మండపం వద్ద అవసరమైన మేర బందోబస్తును ఏర్పాటు చే యాలని, వినాయక నిమజ్జనం సజావుగా జరిగే విధంగా కట్టుదిట్ట మైన భద్రతా వ్యవస్థను ఏర్పాటుచేయాలన్నారు. నిమజ్జన ఏర్పాట్లు ప కడ్బందీగా జరగాలని, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల సహ కారంతో కలిసికట్టుగా పండుగ వాతావరణంలో జరుపుకోవాలని కోరా రు. ఎస్పీ మాట్లాడుతూ విలాద్‌ ఉన్‌నబీ, వినాయక నిమజ్జనం కలిసి వస్తున్న నేపఽథ్యంలో మతసామరస్యం దెబ్బతినకుండా పకడ్బందీ భద్ర త వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈసమావేశంలో ముస్లిం మతపెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2025 | 01:00 AM