భూ సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Jun 07 , 2025 | 12:50 AM
రెవెన్యూ సదస్సులలో భూ సమస్యలపై వచ్చిన ప్రతదరఖాస్తు పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు.
కలెక్టర్ సత్యప్రసాద్
రాయికల్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సదస్సులలో భూ సమస్యలపై వచ్చిన ప్రతదరఖాస్తు పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని వీరాపూర్, దావన్‌పెల్లి గ్రామాల్లో జరుగుతున్న రెవెన్యూ సదస్సులను ఆయన పరిశీలించారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను త్వరగా క్షేత్రస్థాయిలో విచారణ పూర్తి చేసి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వచ్చిన దరఖాస్తులలో విచారణ పూర్తయిన వాటిని వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, శ్రీనివాస్, రాయికల్ తహసీల్దార్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్: గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను భూ సమస్యలు ఉన్న రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం మండలంలోని సాతారం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును సందర్శించారు. రెవెన్యూ సదస్సులో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించారు. కార్యక్రమంలో మెట్‌ప ల్లి ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్, ఆర్‌ఐ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలలను సన్నద్ధంగా ఉంచాలి
జగిత్యాల (ఆంధ్రజ్యోతి): 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న దృష్ట్యా పాఠశాలలను ఇప్పటినుంచే సన్నద్ధంగా ఉంచాలని కలెక్టర్ బి సత్యప్రసాద్ విద్యాశాఖ, వివిధ శాఖల జిల్లా ఆధికారులను ఆదే శించారు. శుక్రవారం బాడిబాట, పాఠశాలల పునః ప్రారంభంపై కలె క్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. అన్ని గ్రా మాల్లో పాఠశాలలను ఇప్పటి నుంచే పరిశు భ్రంగా ఉంచాలని, తాగు నీటి వసతులు, టాయిలె ట్స్, వంట గదులను శుభ్రపరచాలని అలాగే కిచెన్ గార్డెన్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూ చించారు. గ్రామాల్లో బడిబాట కార్యక్రమంలో టీచర్లు ఇంటింటి సర్వే చేయాలని, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానో పాధ్యాయులు, ఎంఈవోలు మానిటరింగ్ చేసినపుడే బడిబాట కార్యక్రమం విజయవంతం అవుతుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని మండల అధికా రులు, విద్యాశాఖ కోఆర్డినేటర్లు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.