ఆపరేషన్ ముస్కాన్ విజయవంతానికి కృషి
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:45 AM
ఆపరేషన్ ముస్కాన్-11ను విజయవంతం చేయాలని ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీపీ చారు సిన్హా అన్నారు.
సిరిసిల్ల క్రైం, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ ముస్కాన్-11ను విజయవంతం చేయాలని ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీపీ చారు సిన్హా అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ ఎస్పీ చంద్రయ్యతో పాటు వివిధ జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ జూలై 1నుంచి 31వరకు ఆపరేషన్ ముస్కాన్‌ను అన్ని శాఖల అధి కారుల సమన్వయంతో నిర్వహించాలన్నారు. ప్రతి అధికారి పక్కా ప్రణాళిక రూపొందించుకొని బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేలా కృషి చేయాలన్నారు. బాలకార్మికులు కనిపిస్తే 1098కు వెంటనే సమా చారం అందించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. బాలకార్మి కులను పనిలో పెట్టుకున్న వారికి చట్ట ప్రకారం శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ చంద్ర య్య మాట్లాడుతూ సిరిసిల్ల, వేములవాడ సబ్ డివిజనల్‌లో ఒక్కో బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందాలు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇటుక బట్టీలు, వివిధ రకాల పరిశ్రమలు, బస్‌స్టేషన్‌లు, ట్రాఫిక్ జంక్షన్‌ల వద్ద క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటున్న పిల్లలను గుర్తించి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కంటం అంజయ్య, సీఐలు నటేశ్, నాగేశ్వర్‌రావు, షీ టీం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.