Share News

చేనేత పారిశ్రామిక సహకార అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Sep 25 , 2025 | 12:08 AM

చేనేత పారి శ్రామిక సహకార అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

చేనేత పారిశ్రామిక సహకార అభివృద్ధికి కృషి

వేములవాడ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : చేనేత పారి శ్రామిక సహకార అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ చేనేత పారిశ్రామిక సహకార సంఘం ఉత్పత్తి, వినియోగదారుల సంఘం సర్వసభ్య సమావేశం బుధ వారం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొ న్న ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మి కుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలి పారు. నేత కార్మికులకు గడిచిన పదేళ్ల కాలంగా ఉన్న బకా యిలను ప్రజాప్రభుత్వం విడుదల చేస్తుందని, నేత కార్మికుల కోరిక మేరకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని, నేతన్న చేయూత, నేతన్న బీమా వంటి అనేక పథకాల బకాయి లు జమ చేస్తున్నామని అన్నారు. వేములవాడలో నూలు డిపో ఏర్పా టుచేసి ఇప్పటివరకు 100 సొసైటీలకు 2500 మెట్రిక్‌ టన్నుల నూలు దారం అందించామని అన్నారు. వస్త్ర పరిశ్రమలో ఆధునిక సాంకేతిక తను పెంచేందుకు హ్యాండ్లూమ్‌ యూనివర్సిటీ, ఐఐహెచ్‌టి ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. రైతుల తరహాలోని నేత కార్మిక కుటుంబాలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతన్న బీమా పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఈ పథ కంలో నమోదు కాబడిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఐదు లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించబడుతుందని తెలిపారు. జిల్లా పరిధి లో చేనేత సహకార సంఘాలకు పావలా వడ్డీ పథకం ద్వారా ఇప్పటి వరకు 15.62 లక్షల మంది చేశారన్నారు. ఆర్థిక వ్యవస్ధ ఇబ్బందికరంగా ఉన్నా పేద ప్రజలపై పన్నుల భారం మోపకుండా ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షుడు నాగుల సత్యనారా యణ, సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2025 | 12:08 AM