Share News

మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేయాలి

ABN , Publish Date - Oct 19 , 2025 | 12:23 AM

మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ మహేష్‌. బి.గితే అన్నారు.

మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేయాలి

వీర్నపల్లి(ఎల్లారెడ్డిపేట), అక్టోబరు18(ఆంధ్రజ్యోతి): మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ మహేష్‌. బి.గితే అన్నారు. విద్యార్థులు, యువత గంజాయి, డ్రగ్స్‌కు దూరంగా ఉండి పట్టుదల, ప్రణాళికబద్ధంగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. వీర్నపల్లి మండలం సీతారాంనాయక్‌ తండాలో నార్కోటిక్‌ ఎస్పీ భూక్య రాంరెడ్డి ఆధ్వర్యంలో ధూమనాయక్‌ భూక్య గారి సామాజిక సేవ ట్రస్ట్‌ వారు నిర్వహించిన ’మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాల’ పై అవగాహన సదస్సులో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్‌.బి.గితే మాట్లాడుతూ గంజాయి రహిత సమాజం కోసం ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. మత్తుకు బానిసగా మారి బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోకూడదని అన్నారు. గర్జనపల్లి గ్రామానికి చెందిన నార్కోటిక్‌ ఎస్పీ భూక్య రాంరెడ్డి ధూమనాయక్‌ భూక్య సామాజిక సేవ ట్రస్ట్‌ను స్థాపించి మారుమూల గ్రామీణ ప్రాంతంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఎస్పీ మహేష్‌. బి.గితే అన్నారు. కార్యక్రమంలో నార్కోటిక్‌ ఎస్పీ భూక్య రాంరెడ్డి, సంస్థ చైర్‌పర్సన్‌, వ్యవస్థాపకురాలు భూక్య విజయ, ప్రధాన కార్యదర్శి భూక్య రాంసాయికిరణ్‌ రామావత్‌, ఉపాధ్యక్షురాలు భూక్య నందిత రమావత్‌, ఎల్లారెడ్డిపేట రూరల్‌ సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐ లక్ష్మన్‌, ఎంఈవో శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ రవి, ఉపాధ్యాయులు, తండాపెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2025 | 12:23 AM