Share News

బీసీ రిజర్వేషన్‌ అమలుకు పార్లమెంట్‌లో కృషి చేయాలి

ABN , Publish Date - Aug 18 , 2025 | 12:03 AM

బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు అయ్యే విధంగా పార్లమెంట్‌ స్థాయిలో కృషి చేయాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నాయకులు మల్కాజిగిరి ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను కోరారు. ఈ మేరకు ఆదివారం ఈటల రాజేందర్‌ను కరీంనగర్‌లో ఐక్యవేదిక నాయకులు కలిసి మాట్లాడారు.

 బీసీ రిజర్వేషన్‌ అమలుకు పార్లమెంట్‌లో కృషి చేయాలి

కరీంనగర్‌ టౌన్‌/గణేశ్‌నగర్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు అయ్యే విధంగా పార్లమెంట్‌ స్థాయిలో కృషి చేయాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నాయకులు మల్కాజిగిరి ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను కోరారు. ఈ మేరకు ఆదివారం ఈటల రాజేందర్‌ను కరీంనగర్‌లో ఐక్యవేదిక నాయకులు కలిసి మాట్లాడారు. తెలంగాణలో గతంలో కన్నా ఇప్పుడు బీసీ ఉద్యమం బలోపేతం అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ బీసీల రాజ్యాధికారం కోసం తన ప్రయత్నం ఉంటుందని బీసీ సమాజం ఏకమై ఉద్యమం చేస్తే బీసీలకు రావాల్సిన అన్ని డిమాండ్‌ల పరిష్కారం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్‌, నాయకులు కలర్‌ సత్తన్న, కర్రె శ్రీనివాస్‌, సిద్ధి సంపత్‌, కనకయ్య ప్రజా పతి, ఎకుల రమేష్‌, రంగరవేణి లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 18 , 2025 | 12:03 AM