వేములవాడ పట్టణాభివృద్ధికి కృషి
ABN , Publish Date - Jul 21 , 2025 | 12:52 AM
వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ కల్చరల్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని శ్రీభీమేశ్వర స్వామి వారి ఆలయంలో దర్శనాల ఏర్పాటు కోసం భక్తులకు ఇబ్బందులు తలెత్త కుండా రూ.3.44 కోట్ల అభివృద్ధి పనులకు ఆదివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీని వాస్ మాట్లాడుతూ దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన ఆలయం, కోడెల మొక్కుల నిలయం, అత్యంత విశిష్టత కలిగిన దేవాలయంగా రాజన్న ఆలయం గుర్తింపు పొందిందని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, 8 మంది మంత్రుల సమక్షంలో రాజన్న ఆలయ అభివృద్ధికి గతఏడాదిలో భూమి పూజ నిర్వహించారని గుర్తు చేశారు. పలు రాష్ట్రాల నుంచి రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించడానికి ప్రత్యేక కృషి చేస్తున్నామని తెలిపారు. 2023 బడ్జెట్‌లో రూ. 50 కోట్లు, 2024-25 సంవత్సర బడ్జెట్‌లో రూ.100 కోట్లు రాజన్న ఆలయం, పట్ట ణాభివృద్ది కోసం కేటాయించామని సూచించారు. ప్రభుత్వ సూచనలు సలహాలతో ఇప్పటికే పట్టణంలో రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టామ ని, రోడ్డు విస్తరణలోని ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితుల కోసం రూ. 47 కోట్లు పరిహారం కేటాయించారన్నారు. ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసు కుంటుందని తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా మొదటి దశలో రూ.76కోట్లతో ఆలయాభి వృద్ధి చేస్తున్నామని, శృంగేరి పీఠా ధిపతుల, ఆలయ పరిరక్షణ కమిటీ సలహాలు, సూచనలతో ఆలయాభివృద్ధికి శాస్త్ర ప్రకారం ముందుకు సాగుతున్నామని తెలి పారు. ఆలయ అభివృద్ధి విస్తర ణకు ఇప్పటికే టెండర్లు పూర్త య్యాయని అన్నారు. ఆలయ విస్తరణ సమయంలో వచ్చే భక్తు లకు దర్శనాలకు ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా, ప్రాచీన ఆల యమైన భీమేశ్వర ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. పురాతన కాలం నుంచి రాజన్న ఆలయానికి తోడుగా భీమేశ్వర ఆలయం ఉందని, పురాణాల్లో చూసినట్లుగా శ్రీరాజరాజేశ్వర స్వామివారిని ఇంద్రుడు, శ్రీరాములు, పంచపాండవులు వచ్చి దర్శనం చేసుకుని భీమేశ్వర ఆలయంలో పూజ లు చేసినట్లుగా తెలుస్తుందన్నారు. భీమేశ్వర ఆలయాన్ని కూడా అభి వృద్ధి పథంలో తీసుకువెళుతున్నామని తెలిపారు. రాజన్న ఆలయ విస్త రణ జరుగుతున్న సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా భీమేశ్వర ఆలయంలో క్యూలైన్ల నిర్మాణం, అభిషేక మండపాలు, కల్యాణ మండ పాలు అనేక అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నామని వివరించారు. రాజన్న ఆశీస్సులు తీసుకుని ఆదివారం శంకుస్థాపన నిర్వహించామని తెలిపారు. వీలైనంత త్వరగా ఆలయ విస్తరణ పనులు చేపడుతా మని అన్నారు. రాజన్న భక్తులు, పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్న ఆలయ విస్తరణ అభివృద్ధి తొందరలోనే అందరి సహాయ సహ కారాలతో పూర్తి చేస్తామని తెలిపారు. వేములవాడ పట్టణ ఆలయ అభివృద్ధి సమాంతరంగా చేస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు పోతోందన్నారు. వచ్చే బడ్జెట్‌తో కూడా నిధులు మంజూరు చేసుకుని ఆలయాభివృద్ధికి సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలి పారు. ఈ కార్యక్రమంలో ఈర్డీవో రాధాబాయి, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ ఆయా శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.