Share News

వేములవాడ పట్టణాభివృద్ధికి కృషి

ABN , Publish Date - Jun 27 , 2025 | 12:18 AM

వేముల వాడ పట్టణాన్ని టెంపుల్‌ సిటీగా అభివృద్ధి చేయడా నికి కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆన్నారు.

వేములవాడ పట్టణాభివృద్ధికి కృషి

వేములవాడ జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): వేముల వాడ పట్టణాన్ని టెంపుల్‌ సిటీగా అభివృద్ధి చేయడా నికి కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆన్నారు. వేములవాడలోని 13,14,15,16 వార్డుల్లో సైడ్‌ డైన్ర్‌, సీసీ రోడ్లు, సీసీ కల్వర్టుల నిర్మాణనికి గురువారం ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ శంకుస్థాప న చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమమే పర మావధిగా ముందుకు పోతున్నామన్నారు. పట్టణం లో 34కుల సంఘ భవనాల నిర్మాణం కోసం నిధు లు కేటాయించామన్నారు. వేములవాడ పట్టణంలో ఇంత పెద్దఎత్తున కుల సంఘాలకు నిధులు ఎవ రు కూడా ఇవ్వలేదన్నారు. సంతోష్‌నగర్‌లో మహి ళలు బతుకమ్మ తెప్ప నిర్మాణం చేపట్టవాల్సిందిగా కోరగా నిర్మిస్తానని హామీ ఇచ్చారు. గతంలో తాగు నీటి సరఫరా కోసం ఇదే కాలనీలో రూ. 15 కోట్లతో తాగునీటి ట్యాంక్‌ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధి, రోడ్డు వెడల్పు పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రోడ్డు వెడల్పు లో కొంత మందికి ఇబ్బంది కలుగుతుందని దాని పట్ల బాధ ఉందని అన్నారు. రోడ్డు వెడల్పు ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న కార్యక్రమం కాబ ట్టి నిర్వాసితులతో మాట్లాడి ముందుకుపోవడం జరిగిందన్నారు. దుకాణాలు కోల్పోతున్న వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆలోచనలు చేస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.76 కోట్లతో టెండర్‌ కానున్నట్లు తెలిపారు. పది సంవత్సరాలుగా పేద ప్రజలు ఎదురు చూస్తున్నా ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్‌ కార్డులను మం జూరు చేసినట్లు తెలిపారు. రాబోవు రోజుల్లో ఏ ఎన్నిక వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికి మద్దతు అందజేయాలన్నారు. అందరి ఆలోచనలకు అనుగు ణంగా వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని పేర్కొన్నారు.

Updated Date - Jun 27 , 2025 | 12:18 AM