Share News

వేములవాడ అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Jul 10 , 2025 | 12:51 AM

దశాబ్దాలుగా వెనుకబడిన వేములవాడ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

వేములవాడ అభివృద్ధికి కృషి

వేములవాడ, జూలై 9 (ఆంధ్రజ్యోతి) : దశాబ్దాలుగా వెనుకబడిన వేములవాడ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ పట్టణంలోని 19,20, 21, 22 వార్డుల్లో సుమారు 54లక్షల రూపాయల అంచనా వ్యయంతో సైడ్‌ డ్రైన్‌, సీసీ రోడ్లు, కల్వ ర్టుల నిర్మాణనికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని, గుడి చెరువులో, మూల వాగులో మురుగునీరు కలవకుండా చర్యలు తీసుకుంటు న్నామన్నారు. గతంలో రెండుసార్లు వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్‌గా పనిచేసి, ప్రస్తుతం ఎమ్మెల్యే గా, రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా ఆలయ అభివృద్ధి, విస్తరణ కార్యక్ర మాలు చేపట్టడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. రాజన్న ఆల య అభివృద్ధికి ఏటా వందకోట్లు కేటాయిస్తామని గత ప్రభు త్వం మోసం చేసిందని, గతంలో తండ్రీకొడుకులు ఎమ్మెల్యే పద విని తమ హోదాకు గుర్తుగా, పరపతిని పెంచుకోవడం కోసం మాత్రమే వాడుకున్నారని, ప్రజల కోసం ఏమాత్రం పనిచేయలే దని, ఫలితంగా ఈ ప్రాంతం అన్ని రకాలుగా వెనుకబడిపోయిం దన్నారు. వేములవాడ ఆలయం, పట్టణ అభివృద్ధి కోసం రాజకీ యాలకు అతీతంగా పనిచేస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే వంట గ్యాస్‌ సిలిండర్‌, పదిలక్షల రూపాయల ఆరోగ్యశ్రీ అమలు చేస్తు న్నామని అన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని సుభాష్‌ నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటిని ఆయన పరిశీలించారు. అర్హులం దరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రొండి రాజు, సెస్‌ డైరెక్టర్‌ నామాల ఉమ, మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2025 | 12:51 AM