Share News

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Sep 26 , 2025 | 12:38 AM

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలి పారు. ధర్మపురి మండలంలోని దొనూ ర్‌, రాయపట్నం గ్రామాల్లో 50 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, గ్రామపంచాయతీ భవనం, అంబేడ్కర్‌ భవన నిర్మాణ పనులకు గురువారం ఆయన ప్రారంభో త్సవ, శంకుస్థాపనలు చేశారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి
దొనూర్‌లో సీసీ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభిస్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

ధర్మపురి, సెప్టెంబరు 25 (ఆంధ్ర జ్యోతి): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలి పారు. ధర్మపురి మండలంలోని దొనూ ర్‌, రాయపట్నం గ్రామాల్లో 50 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, గ్రామపంచాయతీ భవనం, అంబేడ్కర్‌ భవన నిర్మాణ పనులకు గురువారం ఆయన ప్రారంభో త్సవ, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే పలు ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురా వాలని సూచించారు. ధర్మపురి ఏఎంసీ చైర్‌పర్సన్‌ చిలుముల లావణ్య-లక్ష్మణ్‌, టీపీసీసీ సభ్యులు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు సంగనభట్ల దినేష్‌, ధర్మపురి మండల తహ సీల్దార్‌ ఏరుకొండ శ్రీనివాస్‌, పీఆర్‌ ఏఈఈ మహేందర్‌, సీడీపీవో వాణిశ్రీ, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ సంగ నర్సింహులు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కుంట సుధాకర్‌, మండల కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు వేముల రాజేష్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు చీపిరిశెట్టి రాజేష్‌, మాజీ సర్పంచ్‌ కొండపెల్లి సువర్ణ-ప్రకా ష్‌రావు, రాందేని మొగిలి, సింహాజు ప్రసాద్‌, దాసరి పురుషోత్తం, దేవవరం, శరత్‌చంద్ర పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2025 | 12:38 AM