చిన్నారులకు ఆధునిక వసతులతో కూడిన విద్య
ABN , Publish Date - Nov 16 , 2025 | 12:29 AM
చిన్నారులకు ఆధునిక వసతులతో కూడిన విద్య, పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం పాటుపడుతోందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజక వర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డిలు అన్నారు.
వీర్నపల్లి(ఎల్లారెడ్డిపేట), నవంబరు 15(ఆంధ్రజ్యోతి): చిన్నారులకు ఆధునిక వసతులతో కూడిన విద్య, పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం పాటుపడుతోందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజక వర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డిలు అన్నారు. వీర్నపల్లి మండల కేంద్రం లో రూ.7.69 లక్షల నిధులతో తలపెట్టిన భవిత కేంద్రం నిర్మాణానికి భూమి పూజ, మద్దిమల్ల, భూక్యతం డా, కంచర్ల గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్ర భవనాల ను సంబంధిత శాఖ అధికారులతో కలిసి శనివారం వారు ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఐదేళ్లలోపు పిల్లలు ఆటపాటలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందన్నారు. చిన్నారుల అవసరాలకు తగిన ట్టు భవనాలను నిర్మించిందన్నారు. కేంద్రాల్లో పౌష్టికాహారం అందించడంతో పాటు విద్యను బోధించి ఉత్త మపౌరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సర్కారు ముం దుకు సాగుతోందన్నారు. కార్యక్రమంలో సీడీపీవో ఉమారాణి, తహసీల్దార్ ముక్తార్‌పాషా, ఎంపీడీవో శ్రీలేఖ, ఎంపీవో బీరయ్య, ఎల్లారెడ్డిపేట ఎంఈవో కృష్ణహరి, ఏఎంసీ చైర్మన్ రాములునాయక్, వైస్ చైర్మన్ లక్ష్మణ్, ఎస్‌ఐ లక్ష్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సయ్య, కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.