రాష్ట్రంలో విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యం
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:41 AM
రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ముందస్తు జాగ్రత్తలతో ప్రజలు వ్యాధుల బారి నుంచి బయట పడవచ్చని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల అర్బన్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ముందస్తు జాగ్రత్తలతో ప్రజలు వ్యాధుల బారి నుంచి బయట పడవచ్చని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రంలో ఆరోగ్య కార్యకర్తలకు హైపటైటిస్ బి వాక్సినేషన్ ప్రారంబోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హైపటైటిస్ బి వాక్సిన్‌పై గ్రామగ్రామాన ప్రజప్రతినిధులతో పాటు వైద్యులు అవగాహన కల్పించాలని విజ్ఙప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్, ఉప వైధ్యాధికారి డాక్టర్ శ్రీనివాస్, సూపరింటెండెంట్ జివి కృష్ణమూర్తి, రిజనల్ మెడికల్ ఆధికారులు డాక్టర్ సుమన్, డాక్టర్ గీతిక, డాక్టర్ ఆగంతపు నరేష్, డాక్టర్ శ్రీకాంత్, మాతా శిశు కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
- జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 20 లక్షల నిధులతో చేపట్టే తరగతి గదుల నిర్మాణానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమీషన్ స్పందన, నాయకులు గోలి శ్రీనివాస్, బాలె శంకర్, ఏఈ అనిల్, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.