Share News

‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి

ABN , Publish Date - Jul 19 , 2025 | 12:42 AM

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమ లు చేస్తున్న ఇందిరా మహిళాశక్తి పథకంతో మహిళలు ఆర్థికంగా ప్రగ తి సాధిస్తున్నారని డీఆర్డీవో శేషాద్రి తెలిపారు.

‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి

సిరిసిల్ల, జూలై 18 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమ లు చేస్తున్న ఇందిరా మహిళాశక్తి పథకంతో మహిళలు ఆర్థికంగా ప్రగ తి సాధిస్తున్నారని డీఆర్డీవో శేషాద్రి తెలిపారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లాకేంద్రంలో కలెక్టరేట్‌లో ఇందిరా మహిళా శక్తి సంబురాలు నిర్వ హించారు. ధాన్యం కొనుగోలు, వ్యాపారాల నిర్వహణ, స్కూల్‌ యూని ఫాంలు తదితర రంగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన మహిళా సంఘాల సభ్యులను సన్మానించారు. పలు సంఘాలకు రుణాలు, ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా శేషాద్రి మాట్లాడుతూ మహి ళల ఆర్థిక ప్రగతి కోసం ప్రజా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకా న్ని అమలుచేస్తుందని వివరించారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళల ను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఆర్టీసీ బస్సులు, సోలార్‌ ప్లాం ట్లు, క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలుకేంద్రాలు, పెరటికోళ్ల పెంపకం, డెయి రీ యూనిట్‌, పిండి గిర్నీ, మూడు సీహెచ్‌సీలు, స్కూల్‌ యూనిఫామ్‌ ఇతర స్వయం ఉపాధి పథకాలతో ఆర్థికంగా భరోసా అందిస్తుందని వెల్లడించారు. సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలో ధాన్యం కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం సేకరించడం ద్వారా రూ1.06కోట్లు కమిష న్‌ వచ్చిందని తెలిపారు. 46037మంది విద్యార్థులకు స్కూలు యూని ఫామ్‌లు కుట్టిస్తే రూ.48లక్షల చార్జీలు చెల్లించామని తెలిపారు. నియో జకవర్గంలోని 4250 సంఘాలు రుణాలు సకాలంలో చెల్లించడంతో రూ 5.90కోట్ల వడ్డీ ప్రభుత్వం తిరిగి చెల్లించిందని అన్నారు. రుణాలు చెల్లిం చడంలో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. ఇల్లం తకుంట మండల ఆదర్శ మహిళా సమాఖ్య ఉత్తమ సేవలతో జాతీయ పథకానికి ఎంపిక అయిందని అన్నారు. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్లు స్వరూపారెడ్డి, సబేరా బేగం, కొమిరిశెట్టి విజయ, రాణిలు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తుందని అన్నారు. ఉచిత బస్సు, విద్యుత్‌, సబ్సిడీపై గ్యాస్‌ సిలిండర్‌ అందజేస్తు న్నదని తెలిపారు. ఉచిత బస్సు సౌకర్యంతో మహిళలకు ఎంతో మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. ఇందిరా మహిళా శక్తి కింద అందిస్తున్న ఆర్థికసహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తాము ఉపాధి పొందుతూ మిగతా వారికి పని కల్పించే స్థాయికి ఎదుగుతున్నారని వివరించారు. ప్రభుత్వం, కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ప్రత్యేక ప్రణా ళిక ప్రకారం మహిళా సంఘాలకు దాదాపు 23 ఎరువుల దుకాణాలు, పలు పెట్రోల్‌ బంక్‌లు ఇతర స్వయం ఉపాధి యూనిట్లు అందిస్తున్నా రని తెలిపారు. పలు మండలాల్లో త్వరలో సోలార్‌ ప్లాంట్లు ప్రారంభిం చనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌ బేగం, అడిషనల్‌ డీఆర్డీవో సీహెచ్‌ శ్రీనివాస్‌, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2025 | 12:42 AM