Share News

మహిళలకు ఈ- ఆటో డ్రైవింగ్‌ శిక్షణ

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:11 AM

మండలంలోని ఎల్‌ఎండీ కాలనీలో గల దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ మహిళా శిశు వికాస కేంద్రం ఆధ్వర్యంలో మహిళల స్వయం ఉపాధి కోసం ఈ-ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ కార్యక్రమాన్ని శనివారం 12వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు కలెక్టర్‌ పమేలా సత్పతి తెలిపారు. శుక్రవారం శిక్షణకు సంబంధించిన ప్రణాళికపై జిల్లా కలెక్టర్‌ ఆధికారులతో చర్చించారు.

మహిళలకు ఈ- ఆటో డ్రైవింగ్‌ శిక్షణ

తిమ్మాపూర్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎల్‌ఎండీ కాలనీలో గల దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ మహిళా శిశు వికాస కేంద్రం ఆధ్వర్యంలో మహిళల స్వయం ఉపాధి కోసం ఈ-ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ కార్యక్రమాన్ని శనివారం 12వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు కలెక్టర్‌ పమేలా సత్పతి తెలిపారు. శుక్రవారం శిక్షణకు సంబంధించిన ప్రణాళికపై జిల్లా కలెక్టర్‌ ఆధికారులతో చర్చించారు. మోవో ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 18 నుంచి 45 సంవత్సరాల వయస్సులోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 60 రోజుల పాటు ఈ-ఆటో డ్రైవంగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అనుభవజ్ఞులైన మహిళా ఇన్‌స్ట్రక్టర్లతో శిక్షణ ఇప్పించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. శిక్షణ అనంతరం వారికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ అందజేయాలని సూచించారు. శిక్షణ పొందిన వారు స్వయం ఉపాధి పొందేలా ఆటో కొనుగోలు చేసుకునేందుకు రుణం పొందే మార్గాలను, ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి సూచించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి సబిత, అడిషనల్‌ డిఆర్‌డిఓ సునీత, మెప్మా పీడీ వేణుమాధవ్‌, మహిళ ప్రాంగణం మేనేజర్‌ సుధారాణి పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2025 | 12:11 AM