శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా విధులు నిర్వహించాలి
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:26 AM
శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా విధులు నిర్వహించాలని ఏఎస్పీ రుత్విక్ సాయి అన్నారు.
చందుర్తి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా విధులు నిర్వహించాలని ఏఎస్పీ రుత్విక్ సాయి అన్నారు. మండల కేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో పాటు పోలీస్ స్టేషన్ శుక్రవారం ఏఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన వివిధ రకాల రికార్డ్స్, రిజిస్టర్ల ను, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. మండల విస్తీర్ణత, గ్రామపంచాయ తీలు, ఎక్కువగా కేసులు అయ్యే గ్రామాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నేరాల నియంత్రణ మీద చేపట్టాల్సిన చర్యలపై తగిన సూచనలు చేశారు. అనంతరం ఫ్రెండ్లీ పోలీస్ గ్రామాల్లో కలిసిపోవాలని, చట్టపరంగా అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిగేలా, తప్పిదాలకు పాల్పడిన వారికి అవసరమైన గుణపాఠం చెప్పాలన్నారు. స్టేషన్‌కు వచ్చే ప్రతిఒక్కరి సమస్యను అడిగి తెలు సుకొని సమస్యను పరిష్కరించాలన్నారు. ఆయన వెంట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమేష్ పాల్గొన్నారు.