Share News

మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు..

ABN , Publish Date - Nov 27 , 2025 | 12:42 AM

గ్రామపంచాయతీ సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల నోడల్‌ అధికారులు తమ విధులపై పూర్తి అవగాహన కలిగి, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు..

సిరిసిల్ల కలెక్టరేట్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీ సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల నోడల్‌ అధికారులు తమ విధులపై పూర్తి అవగాహన కలిగి, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. నో డల్‌ అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవా రం ఎస్పీ మహేష్‌ బి గీతే, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌తో కలిసి సమావే శమై, వారి విధుల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ నోడల్‌ అధికారుల విధు లు, బాధ్యతలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికలకు నోడల్‌ అధికారుల నియామకం చేపట్టినట్లు తెలిపారు. మానవ వనరుల నిర్వహణ, శిక్షణ, రవాణా, మోడల్‌ కోడ్‌ కండక్ట్‌, ఖర్చు పర్యవేక్షణ, పోస్టల్‌ బ్యాలెట్‌, ఎలక్టోరల్‌ రోల్స్‌, ఎన్నికల పరిశీలకులు విషయమై నోడల్‌ అధికా రుల నియామకం చేసినట్లు తెలిపారు. వివిధ అంశాలకు సంబంధించి నియామకం చేసిన నోడల్‌ అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలకు సంబంధించి అన్ని విధాలుగా సర్వ సన్నద్ధం కావాలన్నారు. ఎన్నికల నిబం ధనలు సమగ్రంగా చదివి అర్థం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు సరిపోను సిబ్బందిని సమకూర్చుకోవాలన్నారు. పర్యవేక్షణ బృందాల రవాణాకు కావాల్సిన వాహనాలు సిద్ధపర్చుకోవాలన్నారు. వివిధ రకాలుగా జిల్లా యంత్రాంగానికి వచ్చే ఎన్నికల ఫిర్యాదులను వేగంగా, క్వా లిటీ పరిష్కారం చూపేలా సన్నద్ధం కావాలన్నారు.ఎన్నికల ప్రవర్తన నియ మావళిని కచ్చితంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో శేషాద్రి, జడ్పీ సీఈవో వినోద్‌ కుమార్‌, డీపీవో షరీపోద్దిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2025 | 12:42 AM