Share News

దసరా జోష్‌..

ABN , Publish Date - Oct 04 , 2025 | 12:07 AM

దసరా జోష్‌ అంతా ఇంతా కాదు.. ఈ యేడాది విజయదశమి వేడుకల్లో సంతోషా ల్లో మునిగేందుకు జనం ఎలాంటి ఖర్చుకూ వెనుకాడలేదు.

దసరా జోష్‌..

- ఒక్క రోజులో రూ. 1.49 కోట్ల మద్యం అమ్మకాలు

- సెప్టెంబరు నెలలో రూ. 7.18 కోట్ల విక్రయాలు

జగిత్యాల, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): దసరా జోష్‌ అంతా ఇంతా కాదు.. ఈ యేడాది విజయదశమి వేడుకల్లో సంతోషా ల్లో మునిగేందుకు జనం ఎలాంటి ఖర్చుకూ వెనుకాడలేదు. జిల్లావ్యాప్తంగా దసరా సంబురాలకు ఏకంగా రూ. 30 కోట్లపైగానే వ్యయం చేసినట్లు అంచనా ఉంది. ప్రధా నంగా మద్యం, మాంసం అమ్మకాలతో పాటు నూతన వస్త్రాలు, ఎలకా్ట్రనిక్స్‌, మిఠా యిలు, తదితర ఆడంబరాల కొనుగోళ్లకు పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. జిల్లాలోని మద్యం దుకణాల్లో ఈనెల 1వ తేదీన ఒక్క రోజు మాత్రమే రూ. 1,49,30,648 విలువ గల మద్యం కొనుగోళ్లు జరిగినట్లు ఎక్సైజ్‌ వర్గాలు తెలిపాయి. ఇందులో 1,112 లిక్కర్‌ బాక్సులు, 3,045 బీర్‌ బాక్సులు విక్రయం అయినట్లు ఎక్సైజ్‌ శాఖ రికార్డులు తెలుపుతున్నాయి. గత సెప్టెంబరు నెలలో రూ. 7.18 కోట్ల విలువ గల 58,849 లిక్కర్‌ బాక్సులు, 1,21,381 బీర్‌ బాక్సులను మందు బాబులు కొనుగోలు చేశారు. ఈనెల 2వ తేదీన దసరా రోజున గాంధీ జయంతి ఉండడంతో జిల్లాలో లిక్కర్‌ అమ్మకాలు జరపలేదు. అయితే పలు బెల్టు దుకాణాలు, ఇతర ప్రాంతాల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరిగాయి.

- మాంసం విక్రయాల జోరు..

దసరా సందర్బంగా మాంసం అమ్మకాలకు పెద్ద పీట ఉంటుంది. గాంధీ జయంతి కారణంగా పలు ప్రాంతాల్లో మాంసం విక్రయాలు జరగనప్పటికీ, అధికారుల కళ్లుగప్పి పలువురు వ్యాపారులు చాటుమాటున మాంసం విక్రయాలు జరిపారు. జిల్లాలో సుమారు 200కు పైగా చికెన్‌, 50 వరకు మటన్‌ దుకణాలు ఉండగా జిల్లా మొత్తంగా అనధికారికంగా సుమారు 300లకు పైగా మాంసం దుకాణాలున్నాయి. గ్రామాలు, పట్టణాలు కలిపి వేల సంఖ్యలో మేకలు, మేక పోతులు, గొర్రె పోతులు (యాటలు) తెగినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రమైన జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి పట్టణాల్లోనే కాకుండా జిల్లాలో మొత్తంగా దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల వరకు వ్యాపారం సాగిన ట్లు అంచనాలున్నాయి. దసరా సందర్భంగా బుధ, గురు, శుక్రవారాల్లో మటన్‌, చికెన్‌ అమ్మకాలు పోటాపోటీగా సాగాయి.

- నూతన వస్త్రాలు, వాహనాలు..

జిల్లాలో బట్టల దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌తో పాటు ఎలకా్ట్రనిక్స్‌, హోం అప్లయెన్సెస్‌, వాహనాల కొనుగోళ్లు, తదితర వ్యాపారాలు కూడా జోరుగా సాగాయి. దసరా సందర్బంగా సుమారు 15 కోట్ల రూపాయలకు పైగా వస్త్ర వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని పేరు మోసిన షాపింగ్‌ మాల్స్‌ జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లిలో తమ బ్రాంచీలను తెరిచాయి. వీటిల్లో రూ. కోట్లలో వ్యాపారం జరిగినట్లు అంచనా ఉంది. ఎలకా్ట్రనిక్స్‌, హోం అప్లయెన్సెస్‌ దుకాణాలతో పాటు మిఠాయిలు, కూల్‌ డ్రింక్స్‌, పూజా సామగ్రి వ్యాపారాలు, ద్విచక్ర వాహన, కార్ల కొనుగోళ్ల వ్యాపారమంతా ఐదు కోట్ల రూపాయలకుపైగా జరిగినట్లు తెలుస్తోంది. ఇక వివిధ మొబైల్‌ ఫోన్ల దుకాణాలు సైతం లక్షల రూపాయల్లో వ్యాపారం చేశాయి. దసరా అనందోత్సహాలకు తగ్గేదేలే అన్న చందంగా జోష్‌ ఎప్పటిలాగే జోరుగా జరిగింది.

Updated Date - Oct 04 , 2025 | 12:07 AM