రేపు జిల్లా వ్యాప్తంగా డ్రంకెనడ్రైవ్ తనిఖీలు
ABN , Publish Date - Dec 30 , 2025 | 12:16 AM
ఆనందోత్సాహాల మధ్య కుటుంబసభ్యులతో కలిసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు నూతన సంవత్సర వేడుక లు జరుపుకోవాలని ఎస్పీ మహేష్ బీ గితే ఒక ప్రకటనలో సూచించారు.
- న్యూ ఇయర్ వేడుకల పేరుతో ప్రజాభద్రతకు భంగం కలిగిస్తే చర్యలు
- డీజేలపై నిషేధం
- ఎస్పీ మహేష్ బి గితే
సిరిసిల్ల, డిసెంబరు 29 (ఆంరఽధజ్యోతి): ఆనందోత్సాహాల మధ్య కుటుంబసభ్యులతో కలిసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు నూతన సంవత్సర వేడుక లు జరుపుకోవాలని ఎస్పీ మహేష్ బీ గితే ఒక ప్రకటనలో సూచించారు. డిసెంబరు 31న సిరి సిల్ల, వేములవాడపట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా డ్రంకెన డ్రైవ్ తనిఖీలు, వాహన తనిఖీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించే ఏ కార్యక్రమమైనా తప్పనిసరిగా పోలీసుల నుంచి ముందస్తు అనుమ తులు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా నిబంధన లకు విరుద్ధంగా డీజేలు, అధిక శబ్దం వచ్చే బాక్స్‌లు ఏర్పాటు చేస్తే ఉపేక్షిం చబోమని హెచ్చరించారు. 2026 సంవత్సరంలో ప్రజలందరికి మంచి కలగాలని ఆశిస్తూ, జిల్లా ప్రజలకు పోలీ స్‌శాఖ తరుపున నూతన సంవత్సర శుభాకాం క్షలు తెలిపారు.
ఫ పోలీసుల నిబంధనలు ఇలా..
- డిసెంబరు 31న టపాసులు, మైకులు వినియోగించి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు.
- జిల్లా వ్యాప్తంగా డీజేలు పూర్తిగా నిషేధం.
- మద్యం మత్తులో వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం వంటి చర్యలకు పాల్పడితే కేసుల నమోదు.
- నూతన సంవత్సర వేడుక లలో నిషేధిత డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాల విక్రయం లేదా వినియోగానికి పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు.
- బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ స్థలాల్లో మద్యం తాగితే కేసుల నమోదు.
- మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబ డితే, వారికి వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదుచేస్తారు. వారి వల్ల ప్రమాదం జరిగితే సంరక్షకులపై కూడా చర్యలు తీసుకుంటారు.
- నిబంధనల ఉల్లంఘనలపై ప్రజలు వెంటనే డయల్-100కు సమాచారం అందించా లి. సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించి కఠిన చర్యలు తీసుకుంటారు.