పక్కా కార్యాచరణతో మాదక ద్రవ్యాల నియంత్రణ
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:40 AM
జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పక్కా కార్యా చరణ అమలు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్ర వాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పక్కా కార్యా చరణ అమలు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్ర వాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లాలో మాదక ద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై ఎస్పీ మహే ష్ బీ గితేతో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించా రు. జిల్లా నార్కోటిక్ కంట్రోల్ సమావేశంలో జిల్లాలో నమోదు అవుతున్న ఎన్‌డీపీఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదక ద్రవ్యాల వాడకం నివా రణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై విస్తృత ప్రచా రం వంటి అంశాలపై చర్చించారు. అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ డ్రగ్స్ నియంత్ర ణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాల రవాణా, సాగు వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవా లని సూచించారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సెలింగ్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటవీశాఖ అధికారులు వారి పరిధిలోని అటవీ భూములు పరిశీ లించి గంజాయి సాగు కనిపిస్తే వెంటనే పోలీస్ అధికా రులకు సమాచారం అందించాలన్నారు. జిల్లాలోని ఆసు పత్రులు, మెడికల్ దుకాణాల్లో స్టాక్ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని సూచిం చారు. చెడుఅలవాట్లు వల్ల ఆరో గ్యం దెబ్బతింటుందని అన్నారు. ఎస్పీ మహేష్ బీ గితే మాట్లా డుతూ గంజాయితో పాటు సాగును అరికట్టేందుకు విస్తృ తంగా తనిఖీలు నిర్వహిస్తున్నా మని అదే సమయంలో డ్రగ్స్, గంజాయి వల్ల కలిగే నష్టాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నా మన్నారు. డ్రంకెన్ డ్రైవ్ తరహా లో గంజాయి పాజిటివ్ వచ్చిన వారి నుంచి సరఫరాదారులను పట్టుకుంటున్నామన్నారు. సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, వేములవాడ ఆర్డీవో రాధాబాయి, మున్సిప ల్ కమిషనర్‌లు ఖదీర్‌పాషా, అన్వేష్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం, ఎక్సై జ్ అధికారి శ్రీనివాసరావు, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.