డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలి
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:20 AM
రోడ్డు ప్రమాదాల నివార ణకు డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలని వేములవాడ సబ్ డివిజనల్ అడి షనల్ ఎస్పీ శేషాద్రినిరెడ్డి అన్నారు.
వేములవాడ టౌన్, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివార ణకు డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలని వేములవాడ సబ్ డివిజనల్ అడి షనల్ ఎస్పీ శేషాద్రినిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఇటీవల పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల తీవ్రత దృష్ట్యా వేములవాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో వ్యాన్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వ హించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి మాట్లాడుతూ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా రోడ్డుభద్రత నియమాలను పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు. వాహనా ల కండీషన్ ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలన్నారు. పరిమితికి లోబడి వాహనాల లోడ్ ఉండాలన్నారు. వాహనాలు నిర్లక్ష్యంగా నడుపడం, కండీషన్ లేని వాహనాలు నడపటంవల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు సంభవించి చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారన్నారు. ప్రధానంగా రాష్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్, ఓవర్‌లోడ్, రాంగ్ రూట్, కండిషన్ లేని వాహనాలు నడపటం వల్ల ప్రమాదాలకు కారణమవుతున్నాయన్నారు. ప్రధానంగా భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు విశ్రాంతి తీసుకోవడం లేదన్నారు. నిద్రమత్తు వల్ల ప్రమాదా లకు కారణమవుతున్నారన్నారు. డ్రైవింగ్ అనేది వృత్తి మాత్రమే కాదని, అనే క కుటుంబాల భవిష్యత్తుతో ముడిపడి ఉందన్నారు. మద్యం సేవించి వాహ నాలు నడుపడం, అతివేగం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం మా నుకోవాలన్నారు. ఈ సందర్భంగా భారీ వాహనాల డ్రైవర్‌లు పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనం తరం రోడ్డు భద్రతపై డ్రైవర్‌లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సదస్సులో వేము లవాడ టౌన్ సీఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్‌ఐ సముద్రాల రాజు, ఎస్‌ఐ రామ్మోహన్‌లు పాల్గొన్నారు.