Share News

హుజూరాబాద్‌లో వృథాగా తాగునీరు

ABN , Publish Date - Oct 19 , 2025 | 11:13 PM

హుజూరాబాద్‌ పట్టణంలోని బస్టాండ్‌ నుంచి బస్సులు బయటకు వెళ్లే దారిలో పైపులైన్‌ లీకేజీ అవుతున్నా మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవడం లేదని దుకాణాదారులు ఆరోపిస్తున్నారు.

హుజూరాబాద్‌లో వృథాగా తాగునీరు

హుజూరాబాద్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌ పట్టణంలోని బస్టాండ్‌ నుంచి బస్సులు బయటకు వెళ్లే దారిలో పైపులైన్‌ లీకేజీ అవుతున్నా మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవడం లేదని దుకాణాదారులు ఆరోపిస్తున్నారు. నెల రోజులుగా పైపులైన్‌ లీకేజీతో రోడ్డుపైనే నీరు ప్రవహిస్తోంది. తిరిగి అవే నీళ్లు మిషన్‌ భగీరథ పైపులైన్‌లోకి వెళ్తున్నాయి. ఈ నీటిని తాగిన ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. హుజూరాబాద్‌ పట్టణంలోని మిషన్‌ భగీరథ పైపులైన్లు ఇష్టానుసారంగా వేయడంతోనే సమస్య ఏర్పడిందని పట్టణ ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులు స్పందించి పైపులైన్‌ లీకేజీ కాకుండా మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.

Updated Date - Oct 19 , 2025 | 11:13 PM