Share News

తాగునీరు, పారిశుధ్య సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Dec 24 , 2025 | 11:38 PM

సిరిసిల్ల పట్టణంలో మిషన్‌ భగీరథ తాగునీరు, పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలం టూ బుధవారం బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టా రు.

తాగునీరు, పారిశుధ్య సమస్యలు పరిష్కరించాలి

సిరిసిల్ల టౌన్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల పట్టణంలో మిషన్‌ భగీరథ తాగునీరు, పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలం టూ బుధవారం బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టా రు. నాయకులు, స్థానికులు ఖాళీ బిందెలతో మున్సిపల్‌ ఎదుట సిద్దిపే ట-సిరిసిల్ల రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో వాహనాలకు అంత రాయం కావడంతో అక్కడకు చేరుకున్న పట్టణ సీఐ కృష్ణ సూచన మేరకు మున్సిపల్‌ గేట్‌ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. కమిష నర్‌ ఎండీ ఖాదీర్‌పాషా ఆలస్యంగా మున్సిపల్‌ కార్యాలయానికి చేరు కోవడంతో బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేకుంది. మిషన్‌ భగీరథ తాగునీరు, పారిశుధ్యం, స్ట్రీట్‌లైట్స్‌ తదితర సమస్యలతో పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నార ని, పలుమార్లు మీ దృష్టికి తీసుకొచ్చిన ఎందుకు పరిష్కరంచడం లేద ని కమిషనర్‌ను బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్‌ నిలదీశా రు. విద్యుత్‌మోటర్‌ సమస్యలతో కొన్ని వార్డుల్లో తాగునీటి సమస్య నెలకొందని, రెండు రోజుల్లో పరిష్కరిస్తామని కమిషనర్‌ హామీ ఇవ్వ డంతో ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మ్యాన రాంప్రసాద్‌, మెరుగు శ్రీనివాస్‌, కొండ నరేష్‌, మోర శ్రీహరి, పల్లకొండ నర్సయ్య, కాంభోజ శ్రీధర్‌, ఆంకారపు రాజు చొప్పదండి శ్రీని వాస్‌, మోర రవి, కోడం రవి, సూరం వినయ్‌, సిద్ది దేవరాజు, మురళి కృష్ణ, గాలి శ్రీనివాస్‌, ఊరకొండ రాజు, వేముల వైశాలి, కమటం మం జుల, మల్లీశ్వరి, లత, వనిత పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2025 | 11:38 PM