విపత్కర సమయాల్లో వినియోగానికి డీఆర్‌ఎఫ్ బృందం
ABN , Publish Date - Jul 03 , 2025 | 12:45 AM
వర్షాకాలం దృష్ట్యా భారీ వర్షాలు, వరదలు ఇతర ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టేందుకు 12మందితో కూడిన డిజాస్టర్ రెస్పాన్స్ బృందం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు.
వేములవాడ రూరల్, జూలై 2 (ఆంధ్రజ్యోతి) : వర్షాకాలం దృష్ట్యా భారీ వర్షాలు, వరదలు ఇతర ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టేందుకు 12మందితో కూడిన డిజాస్టర్ రెస్పాన్స్ బృందం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు. ఇద్దరు ఎస్సై స్థాయి అధికారులతో 10 మందితో డిఆర్‌ఎఫ్ బృందం అందు బాటులో ఉంటుందన్నారు. భారీ వర్షాలు, వరదలు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తక్షణమే స్పందించి సహాయక చర్యలు అందించాలన్నారు. వేములవాడ పట్టణ పరిధిలోని నాంపెల్లి చెరువులో నిర్వహించిన శిక్షణలో బీఆర్‌ఎఫ్ బృందంతో పాటు ఎస్పీ మహేష్ బి.గితే బోటులో ప్రయాణిం చారు. ఈ సందర్బంగా సిబ్బందికి పలు సూచనలు చేసారు. అత్యవసర సమయంలో తక్షణమే స్పందించేందుకు బీఆర్‌ఎఫ్ బృందం సంసిద్ధంగా ఉం డాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే 100కు డయల్ చేసి సమాచారం అందిం చాలన్నారు. విపత్కర సమయంలో జిల్లా పోలీస్ యంత్రాంగం, డీఆర్‌ఎఫ్ బృందం రెస్క్యూబోట్, మోటర్ మిషన్, లైఫ్ జాకెట్స్, ఉడ్ కట్టర్స్‌లాంటి ఆధు నిక పరికరాలతో 24గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్, ఆర్.ఐలు రమేష్, యాదగిరి, ఆర్‌ఎస్సైలు శ్రవణ్‌యా దవ్, సాయికిరణ్, రాజు, ఎస్సై ఎల్లాగౌడ్, డీఆర్‌ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.