ఈజీఎస్ సిబ్బందిపై డీఆర్‌డీవో ఆగ్రహం
ABN , Publish Date - Oct 19 , 2025 | 12:30 AM
మండలంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్వహించిన పనులు నిబంధనలను ఉల్లంఘించి ఇష్టానుసారం గా పనులు నిర్వహించారని డీఆర్‌డీవో పీడీ రఘువరణ్ సంబంధిత సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
- మస్టర్లు లేకుండానే చెల్లింపులు
- రూ. 60 వేలకు పైగా రికవరీకి ఆదేశాలు
గొల్లపల్లి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): మండలంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్వహించిన పనులు నిబంధనలను ఉల్లంఘించి ఇష్టానుసారం గా పనులు నిర్వహించారని డీఆర్‌డీవో పీడీ రఘువరణ్ సంబంధిత సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాం టివి పునారవృతం అయితే శాఖపరమైన కఠిన చర్యలు తప్పవని ఏపీవో వేణును, సిబ్బందిని తీవ్రంగా హెచ్చరించారు. శనివా రం గొల్లపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో సామాజిక తనీఖీ ప్రజావేదిక కార్య క్రమాన్ని అఽధికారులు నిర్వహించారు. పలు సందర్భాల్లో ఇష్యూంగ్ అథారిటీ అధికారి సంతకాలు లేకుండానే పనులు పనులు నిర్వహించినట్లు గుర్తించారు. మస్టర్లు లేకుండానే కూలీలకు వేతనాలు చెల్లించిన ట్లు బహిర్గతమైంది. మేజర్‌మెంట్ బుక్, వర్క్ ఫైల్ బుక్‌లో మెయింటేన్ చేయకుం డా ఇష్టానుసారంగా విధుల నిర్వహణలో నిబంధనలను తుంగలో తొక్కినట్లు గుర్తించి సంబంధిత అధికారులు, సిబ్బంది పనితీరు పై అసహనం వ్యక్తం చేశారు. పలు గ్రామా ల్లో రైతుకూలీల అంగీకారపత్రాలు లేకుండానే పనులు చేసిన ట్లు తేలింది. ఇష్యూంగ్ అథారిటీ అధికారి సంతకం లేకుండా పనులు ఏలా చే యిస్తారని నిలదీశారు. పక్క దారి పట్టిన రూ. 62,809 నిధులను సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, టెక్ని కల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్ల నుం చి రికవరి చేయాలని ఆదేశించారు. కార్యక్ర మంలో ఎస్‌క్యూసీవో మల్లికార్జున్, అంబుడ్స్ మేన్ అధికారి కృష్ణారెడ్డి, ఎంపీడీవో రాంరె డ్డి, అసిస్టెంట్ డీవో దేవేందర్‌రెడ్డి, ఏపీవో వేణు, టీఏలు, కంప్యూటర్ ఆపరేటర్లు, డీ ఆర్‌పీలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు పాల్గొన్నారు.